దక్షిణాది నెపోటిజం బాధితులు ఏమంటారో?

  • March 25, 2021 / 03:07 PM IST

సినిమా పరిశ్రమలో సాధారణ నటిగా ప్రవేశించి, చిన్న చిన్న పాత్రలు చేసి, ఎన్నో కష్టాలు పడి… ఇప్పుడు స్టార్‌ హీరోయిన్‌గా, అవార్డు యాక్ట్రెస్‌గా ఎదిగింది కంగన రనౌత్‌. ఆమె నటిగా ఎదుగుతున్న సమయంలోనే… ఆమె చేసే కామెంట్లు, విమర్శలు కూడా ఎదుగుతూ వచ్చాయి. ఇప్పుడు బాలీవుడ్‌లో నెపోటిజం వ్యతిరేక ఉద్యమ నాయికగా మారింది. ‘నెపోటిజం నశించాలి’ అనే మాట కొత్త కాకపోయినా… ఆమె దానిని కంటిన్యూగా కొనసాగిస్తోంది. తాజాగా నెపోటిజం గురించి మరోసారి మాట్లాడింది. అయితే ఈసారి దక్షిణాది గురించి మాట్లాడటం విశేషం.

కంగన రనౌత్‌ ప్రస్తుతం ‘తలైవి’ సినిమా ప్రచార పనుల్లో బిజీగా ఉంది. ఈ క్రమంలోనే తెలుగు, తమిళ చిత్ర పరిశ్రమల్లో నెపోటిజం ఉందని చెబుతూనే… మరో రెండు ‘ఇజాలు’ ఇక్కడ లేవు అని అంది. ‘‘తమిళ, తెలుగు పరిశ్రమల్లో వారసులు కాని వాళ్లు ఎంటర్‌ అయితే వారిని ఇబ్బంది పెట్టే పరిస్థితులు ఉండవు. కొత్తవాళ్లను ఇక్కడ బాగా సపోర్టు చేస్తారు. వాళ్లను ఆదరిస్తారు. కారణం ఇక్కడ గ్రూపిజం, గ్యాంగిజం లేకపోవడమే’’ అని చెప్పింది కంగన. నేను బయటి నుండి వచ్చినా నన్ను ఆదరిస్తున్నారన్నా అదే కారణం, అందుకే ఇక్కడ కొనసాగాలని అనుకుంటున్నాను. మరిన్ని సినిమాలు చేయాలనుకుంటున్నాను అని అంది కంగన.

అయితే దక్షిణాదిలోనూ కొత్త వాళ్లకు సరైన అవకాశాలు రావడం లేదు, నెపోటిజం వల్ల నష్టపోతున్నాం అంటూ చాలామంది నటీనటులు ఆరోపిస్తూ వస్తున్నారు. ఈ సమయంలో కంగన ఇలా ‘కొత్తవాళ్లను సౌత్‌ బాగా చూసుకుంటుంది’ అంటూ కామెంట్‌ చేయడం చర్చనీయాంశంగా మారింది. తనను ఆదరించాలని అలా కంగన అందో, లేక నిజంగా ఇక్కడ కొత్తవాళ్లు ఇబ్బంది పడటం లేదో గతంలో ఆరోపించినవారే చెప్పాలి. ‘నెపోటిజం’ వ్యతిరేక ఉద్యమకర్తగా తనను తాను చెప్పుకునే కంగనను ఎంత మంది దక్షిణాది బాధితులు సపోర్టు చేస్తారో చూడాలి.

Most Recommended Video

ఈ 10 మంది హీరోయిన్లు టీనేజ్లోనే ఎంట్రీ ఇచ్చేసారు తెలుసా..!
ఈ సక్సెస్ ఫుల్ డైరెక్టర్లు ఒకప్పుడు స్టార్ డైరెక్టర్స్ దగ్గర అసిస్టెంట్లుగా చేసిన వాళ్ళే..!
తన 11 ఏళ్ళ కేరీర్లో సమంత మిస్ చేసుకున్న సినిమాల లిస్ట్..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus