తరచూ ఏదో ఒక వివాదాల ద్వారా వార్తల్లో నిలిచే కంగనా వరుస సినిమా షూటింగులతో బిజీగా ఉన్న సమయంలో సినిమాలకు సంబంధించిన విషయాల ద్వారా మాట్లాడుతూ వార్తల్లో నిలుస్తుంటారు. అయితే ఈమెకు సినిమా షూటింగులు కనుక లేకపోతే ఇండస్ట్రీకి సంబంధించిన ఏదో ఒక విషయం గురించి తరచు వార్తల్లో నిలుస్తూ వివాదాలకు కారణం అవుతూ ఉంటారు.ఇలా తరచు వివాదాస్పద వ్యాఖ్యల ద్వారా వార్తలలో నిలిచే కాంగన తాజాగా దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళికి తన మద్దతును ప్రకటించారు.
గత కొద్ది రోజుల క్రితం ఎస్.ఎస్.రాజమౌళి ఒక ఇంటర్వ్యూలో పాల్గొని మతం హిందూ గ్రంధాలపై తన అభిప్రాయాలను తెలియజేశారు. తనకు రామాయణం మహాభారతం అంటే చాలా ప్రేమ ఉందని తెలిపారు. అయితే తన నుంచి మతపరమైన అంశాలకు దూరంగా ఉంటానని తెలిపారు. ఇలా మతం గురించి మాట్లాడటంతో రైట్ వింగ్ ఈయనని టార్గెట్ చేస్తూ వచ్చారు.
ఈ క్రమంలోనే కంగనా రాజమౌళికి పద్ధతి తెలుపుతూ.. రాజమౌళి గారిని లక్ష్యంగా చేసుకోవద్దని ఆయనకు హితువు పలికారు. ఈ క్రమంలోనే వరుస ట్వీట్లతో ఈమె రైట్ వింగ్ కు వార్నింగ్ ఇచ్చారు.మీరు దీనిపై అతిగా స్పందించాల్సిన అవసరం లేదు మేము కళాకారులం అందరి కోసం సినిమాలు చేస్తాము. మేధావి జాతీయవాది అయినటువంటి రాజమౌళి సార్ కి వ్యతిరేకంగా నేను దేనిని సహించను. ఆయన ఒక ప్రాంతీయ సినిమాని ప్రోత్సహించారు. ఈ దేశాన్ని ప్రేమిస్తున్నారు.
దేశం పట్ల ఎంతో అంకితభావం ఉన్నటువంటి రాజమౌళి సమగ్రతను ప్రశ్నించడానికి మీకు ఎంత ధైర్యం అంటూ ది న్యూయార్క్ లో రాజమౌళి గురించి వచ్చిన కథనంపై ఈమె తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తూ రాజమౌళి గారికి తన మద్దతు తెలియజేస్తూ వరుస ట్వీట్లతో రెచ్చిపోయారు. దీంతో కంగనా చేసినటువంటి ఈ ట్వీట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక ఈమె గతంలో కూడా రాజమౌళికి తన మద్దతు తెలుపుతూ ఎన్నోసార్లు ట్వీట్లు చేసిన సంగతి మనకు తెలిసిందే.