మళ్ళీ సంచలన వ్యాఖ్యలు చేసిన కంగనా రనౌత్..!

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగనా రనౌత్ బాలీవుడ్ లో ఎంతటి స్టార్ ఇమేజ్ ఉన్న దర్శక నిర్మాతల పైన అయినా .. అలాగే స్టార్ హీరోల పైన అయినా సరే ఆరోపణలు చెయ్యడానికి ఎంత మాత్రం వెనుకాడదు. గతంలో కూడా ఈమె ఎంతో మంది స్టార్ల పై ఎన్నో ఆరోపణలు చేసింది. ఇప్పుడు నెపోటిజం అనే ఇష్యు ట్రెండ్ అవుతుండడంతో ఈమె చేస్తున్న కామెంట్స్ ఓ రేంజ్లో వైరల్ అవుతున్నాయి. ఇందులో భాగంగా ఈమె పై ఎవరయినా సెటైర్లు వేస్తే వాళ్ళను కూడా ఈమె విడిచి పెట్టడం లేదు.

ఇప్పటికే మహేశ్ భట్, కరణ్ జొహార్, జావెద్ అఖ్తర్ వంటి స్టార్ల పై ఎన్నో ఆరోపణలు చేసింది. తాజాగా ‘యశ్ రాజ్ ఫిలింస్’ అధినేత అయిన ఆదిత్య చోప్రా పై తీవ్ర వ్యాఖ్యలు చేసింది కంగనా. ఆమె మాట్లాడుతూ.. “నిర్మాత ఆదిత్య చోప్రా నా కెరీర్ ను నాశనం చేస్తానని బెదిరించాడు. 2016లో సల్మాన్ ఖాన్ హీరోగా తెరకెక్కిన ‘సుల్తాన్’ చిత్రాన్ని నేను రిజెక్ట్ చెయ్యడం వల్లనే నా పై అతను ప్రతీ కార చర్యలకు పాల్పడతానని హెచ్చరించాడు.

‘సుల్తాన్’ కు నో చెప్పినందుకు సారీ చెప్పాలని నేను ఆదిత్య చోప్రా వద్దకు వెళ్ళాను. కొద్దిసేపు ఆయన బాగానే ఉన్నాడు… కానీ తరువాత నా పై కోపాన్ని ప్రదర్శించాడు. ‘నాకే నో అని చెప్పడానికి నీకెంత ధైర్యం.? నీ కెరీర్ ను నాశనం చేస్తా’ అంటూ ఆయన నన్ను బెదిరించాడు. ఇప్పుడు బాలీవుడ్ లో కంగనా పై చాలా నెగిటివిటీ ఏర్పడుతున్నప్పటికీ ఈమె మాత్రం వెనకడుకు వెయ్యకపోతుండడం గమనార్హం.

Most Recommended Video

చిరంజీవి, బాలకృష్ణలు తలపడిన 15 సందర్భాలు!
తమ ఫ్యామిలీస్ తో సీరియల్ ఆర్టిస్ట్ ల.. రేర్ అండ్ అన్ సీన్ పిక్స్..!
ఇప్పటివరకూ అత్యధిక కలెక్షన్లను రాబట్టిన తెలుగు సినిమాలు ఇవే!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus