బాలీవుడ్ ఇండస్ట్రీలో కాంట్రవర్సీ క్వీన్ గా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న కంగనా రౌనత్ గురించి ఎంత చెప్పినా తక్కువే ఈమె మంచిని ప్రోత్సహిస్తూ చెడుని కుండబద్దలు కొట్టినట్టు మాట్లాడుతూ ఉంటారు టాలెంట్ ఉన్న వాళ్ళని ఎప్పుడు ఎంకరేజ్ చేస్తూ ఉండే ఈమె, తన గురించి ఎవరైనా తప్పుగా మాట్లాడిన వారికి తనదైన శైలిలో సమాధానం చెబుతూ ఉంటారు.
ఇలా తరచూ ఏదో ఒక వివాదాస్పద వ్యాఖ్యల ద్వారా వార్తల్లో నిలిచే ఈమె బాలీవుడ్ నేపో కిడ్స్ గురించి తరచూ సంచలన వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలుస్తుంటారు.అయితే బాలీవుడ్ ఇండస్ట్రీలో నేపోటిసం ఎక్కువగా ఉంది అంటూ వాదించే ఈమె ఈ మధ్యకాలంలో బాలీవుడ్ సినిమాలను పూర్తిగా తగ్గించి సౌత్ సినిమాలపై తన దృష్టిని పెట్టారు.
ఈ క్రమంలోనే ప్రస్తుతం కంగనా చంద్రముఖి సినిమాకు సీక్వెల్ గా వస్తున్నటువంటి చంద్రముఖి 2 లోజ్యోతిక పాత్రలో నటిస్తున్నారు. ఈ క్రమంలోనే ఈ సినిమాలో జ్యోతిక పాత్ర గురించి కంగనా మాట్లాడుతూ పలు విషయాలను తెలియజేశారు. చంద్రముఖి సినిమాలో జ్యోతిక నటన అద్భుతం ఆమెతో పాటు దీటుగా నటించడం ఎవరివల్ల కాదు. జ్యోతిక స్థాయిలో నటించే అంత సీన్ తనకు లేదని తెలిపారు.
ఇక జ్యోతిక రేంజ్ లో నన్ను కంపేర్ చేసి కనుక చూస్తే మాత్రం నిరాశ తప్పదని చెప్పగలను అంటూ ఈమె జ్యోతిక నటన గురించి ప్రశంసలు కురిపించారు. ఇక పి వాసు దర్శకత్వంలో 2005వ సంవత్సరంలో రజనీకాంత్ నయనతార జ్యోతిక ప్రధాన పాత్రలలో తెరకెక్కిన చంద్రముఖి సినిమాకు ప్రస్తుతం సీక్వెల్ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇందులో రజనీకాంత్ స్థానంలో రాఘవ లారెన్స్ నటించగా జ్యోతిక స్థానంలో కంగనా నటిస్తున్నారు.