Kangana Ranaut: ప్రేమ పెళ్లి గురించి షాకింగ్ కామెంట్స్ చేసిన కంగనా?

బాలీవుడ్ ఇండస్ట్రీలో సంచలనాలకు కేంద్ర బిందువుగా ఉన్నటువంటి వారిలో నటి కంగనా కూడా ఒకరు ఈమె సోషల్ మీడియా వేదికగా ఎలాంటి పోస్ట్ చేసిన అది వివాదాస్పదంగా మారుతుంది. ఇలా తరచూ వివాదాస్పద వ్యాఖ్యల ద్వారా వార్తల్లో నిలిచే కంగనా తాజాగా తేజస్ మూవీ ప్రమోషన్లలో పాల్గొన్నారు. ఈ సినిమా అక్టోబర్ 27వ తేదీ ప్రేక్షకుల ముందుకు వచ్చినప్పటికీ పలు ఇంటర్వ్యూలకు ఈమె హాజరవుతున్నారు. ఈ సందర్భంగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి కంగనా తన ప్రేమ గురించి అలాగే పెళ్లి గురించి మాట్లాడుతూ చేసినటువంటి వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.

ఈ సందర్భంగా కంగనా మాట్లాడుతూ తనకు ఒక బ్రేకప్ స్టోరీ ఉందని తెలిపారు. తెలిసి తెలియని వయసులో ప్రేమలో పడ్డానని తెలిపారు. అయితే ఆ ప్రేమ కాస్త బ్రేకప్ అయిందని ఈమె వెల్లడించారు అయితే తన లవ్ బ్రేకప్ కావడం తనకు చాలా మంచి చేసిందని ఇకపోతే ప్రేమలో పడి తాను ఎంతో సమయం వృధా చేసుకునేదాన్ని అంటూ తెలిపారు.. నిజానికి ప్రేమలో ఉండటం కన్నా లవ్ బ్రేకప్ అయితేనే ఎన్నో లాభాలు ఉంటాయి.

ఇలా లవ్ బ్రేకప్ వల్ల కలిగే లాభాలు చాలా మందికి ఆలస్యంగా తెలుస్తాయని కంగనా వెల్లడించారు. ఇక పెళ్లి గురించి మాట్లాడుతూ ప్రతి ఒక్క అమ్మాయి పెళ్లి చేసుకుని తన పిల్లలు కుటుంబంతో సంతోషంగా ఉండాలని కోరుకుంటారు. తను కూడా ఈ పెళ్లి అనే వ్యవస్థకు ఎంతో గౌరవం ఇస్తానని తెలిపారు. ఇక తాను కూడా పెళ్లి చేసుకుని తనకంటూ ఒక ఫ్యామిలీ ఉండాలని కోరుకుంటున్నానని అయితే నా పెళ్లి జరగడానికి మరొక ఐదు సంవత్సరాల కాలం పడుతుందని తెలిపారు.

ఇక తన (Kangana Ranaut) పెళ్లి పెద్దలు నిశ్చయించిన ప్రేమ వివాహమే చేసుకుంటానని తెలిపారు. కచ్చితంగా నా పెళ్లినీ నా తల్లిదండ్రులే చేయాలి అంటూ ఈ సందర్భంగా పెళ్లి గురించి కంగన చేసినటువంటి కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

భగవంత్ కేసరి సినిమా రివ్యూ & రేటింగ్!

లియో సినిమా రివ్యూ & రేటింగ్!
టైగర్ నాగేశ్వరరావు సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus