Kangana: పెళ్లి చేసుకోవాలని ఉంది… తొందరపడితే జరగదు కదా?

బాలీవుడ్ ఇండస్ట్రీలో ఫైర్ బ్రాండ్ గా పేరు ప్రఖ్యాతలు పొందినటువంటి కంగనా రౌనత్ తరచు ఏదో ఒక కాంట్రవర్సీల ద్వారా వార్తల్లో నిలుస్తుంటారు.ఏ విషయం గురించైనా నిర్మొహమాటంగా మాట్లాడుతూ సోషల్ మీడియా వేదికగా చేసే పోస్టులు పలు వివాదాలకు కారణం అవుతూ ఉంటాయి. ఈ విధంగా తరచూ వార్తల్లో నిలిచే ఈమె తాజాగా పెళ్లి గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా కంగనా రౌనత్ పెళ్లి గురించి మాట్లాడుతూ పలు విషయాలు తెలియజేశారు.

తాను కూడా అందరిలాగే పెళ్లి చేసుకుని నాకంటూ కొత్త జీవితం సొంత ఫ్యామిలీ ఉండాలని కోరుకుంటున్నానని తన మనసులో మాటను బయటపెట్టారు. అయితే నేను పెళ్లి చేసుకోవాలనుకుంటేనే పెళ్లి జరగదు కదా అంటూ కామెంట్స్ చేశారు. ఏది ఎప్పుడు జరగాలని రాసిపెట్టి ఉంటే అప్పుడే జరుగుతుందని మనం తొందరపడిన జరగదు అంటూ తెలియజేశారు.నా పెళ్లి ఎప్పుడు జరగాలని ఉందో అప్పుడే జరుగుతుందనీ ఈ సందర్భంగా కంగనా పెళ్లి చేసుకోవాలని కోరిక తనలో ఉంది అంటూ చెప్పకనే చెప్పేశారు.

అయితే గతంలో కూడా ఈమె (Kangana) పెళ్లి గురించి ఇలాంటి వ్యాఖ్యలు చేసిన సంగతి మనకు తెలిసిందే. దాకడ్ సినిమాలో టామ్ బాయ్ లా ఉన్నట్టు నిజ జీవితంలో కూడా తాను ఎందుకు అలా ఉంటానని ప్రశ్నించారు. నేను ఇతరులపై ఎందుకు చేయి చేసుకుంటాను నేను అలా ఉంటే నాకు ఈ జీవితంలో పెళ్లి కాదు. మీరు ఈ విధంగా నాపై లేనిపోని పుకార్లు సృష్టించడం వల్ల నాకు ఈ జీవితంలో పెళ్లి కాదు అంటూ ఈమె గతంలో కూడా తన పెళ్లి గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసిన సంగతి మనకు తెలిసిందే.

ఇలా ఫైర్ బ్రాండ్ గా పేరు సంపాదించుకున్నటువంటి కంగనా పెళ్లి గురించి ఇలాంటి వ్యాఖ్యలు చేయడంతో ఈ కామెంట్స్ కాస్త వైరల్ అవుతున్నాయి. ఇక ఈమె సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం ఈమె టీకు వెడ్స్ షేరు సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో బిజీగా ఉన్నారు. అలాగే చంద్రముఖి 2 సినిమాలో కూడా నటిస్తున్న విషయం తెలిసిందే.

ఆదిపురుష్ సినిమా రివ్యూ & రేటింగ్!

‘సైతాన్’ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
కుటుంబం కోసం జీవితాన్ని త్యాగం చేసిన స్టార్ హీరోయిన్స్

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus