బాలీవుడ్ ఇండస్ట్రీలో నటిగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న కంగనా నిత్యం ఏదో ఒక వివాదాస్పద వ్యాఖ్యల ద్వారా వార్తల్లో నిలుస్తూ కాంట్రవర్సీకి కేరాఫ్ అడ్రస్ గా మారిపోయారు. ఇలా ఈమె సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్ వేదికగా ఎన్నో వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలుస్తుంటారు.ఈ క్రమంలోనే ఈమె ట్విట్టర్ వేదికగా ఈ విధమైనటువంటి పోస్టులు చేయడంతో గత ఏడాది ఈమె ట్విట్టర్ అకౌంట్ బ్లాక్ చేసిన సంగతి తెలిసిందే.
ఈ క్రమంలోనే తాజాగా కంగనా ట్విట్టర్ గురించి ఇంస్టాగ్రామ్ లో సుదీర్ఘమైన పోస్ట్ చేస్తూ ట్విట్టర్ పై ప్రశంసలు కురిపించారు. ప్రస్తుతం ట్విటర్ గురించి ఈమె చేసినటువంటి పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ట్విట్టర్ సీఈఓ ఎలాన్ మాస్క్ తీసుకున్నటువంటి నిర్ణయానికి కంగనా తన మద్దతు తెలుపుతూ చేసినటువంటి ఈ పోస్ట్ వైరల్ అవుతుంది. ట్విట్టర్ లోబ్లూటిక్ పొందడం కోసం డబ్బును చెల్లించాల్సి ఉంటుందని ఇదివరకే ట్విట్టర్ సీఈఓ వెల్లడించారు.
ఈ క్రమంలోనే ఈ విషయంపై స్పందించిన కంగనా బ్లూటిక్ కోసం కొంత మొత్తంలో డబ్బు వసూలు చేయడం సరైన నిర్ణయం. సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్స్ అన్నీ కూడా ఉచితంగా సౌకర్యాలను కల్పిస్తే డబ్బు ఎలా వస్తుంది? ఎలన్ మస్క్ తీసుకున్నటువంటి ఈ నిర్ణయం వల్ల ట్విట్టర్ ప్లాట్ఫామ్ మరింత మెరుగుపరచడానికి దోహదపడుతుందని ఈమె తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.
ఇలా ట్విట్టర్ గురించి ఈమె ప్రశంసల కురిపిస్తూ ఇంస్టాగ్రామ్ వేదికగా ఈ పోస్ట్ చేయడంతో ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్ గా మారింది. ఇలా ట్విట్టర్ పై ఈమె ప్రశంసలు కురిపించడంతో త్వరలోనే ఈమె ట్విట్టర్ పై ఉన్న నిషేధం తొలగిపోతుందని పలువురు భావిస్తున్నారు.2021 వ సంవత్సరంలో ఈమె ట్విట్టర్ నిబంధనలను ఉల్లంఘించాలన్న నేపథ్యంలో తన ట్విట్టర్ ఐడిని ట్విట్టర్ యాజమాన్యం బ్లాక్ చేశారు.