Kangana Ranaut: త్వరలోనే కంగనా వివాహం.. వరుడు ఎవరో తెలుసా?

బాలీవుడ్ ఇండస్ట్రీలో వివాదాస్పద నటిగా ఎంతో పేరు ప్రఖ్యాతలు పొందినటువంటి కంగనా రౌనత్ తరచు ఏదో ఒక వివాదంలో వార్తల్లో నిలుస్తూ ఉంటారు. ఈమె పెళ్లి చేసుకోబోతుంది అంటూ ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కంగనా పెళ్లి గురించి వస్తున్నటువంటి ఈ వార్తలలో ఎంతవరకు నిజము ఉందో లేదో తెలియదు గాని బాలీవుడ్ నటుడు ప్రముఖ క్రిటిక్ కే అర్ కే చేసినటువంటి ట్వీట్ వైరల్ గా మారింది.

ఈయన తరచూ ఇండస్ట్రీలోని సెలబ్రిటీలకు సంబంధించినటువంటి ట్వీట్లు చేస్తూ వార్తల్లో నిలుస్తుంటారు. అయితే ఎంతోమంది సెలబ్రిటీలు ఈయనపై ఆగ్రహం వ్యక్తం చేసినప్పటికీ ఈయన ధోరణి మాత్రం మారలేదు. అయితే తాజాగా కంగనా పెళ్లి చేసుకోబోతుందని ఈయన చేసినటువంటి ట్వీట్ వైరల్ గా మారింది. ఇక ఈమె ప్రముఖ బిజినెస్ మెన్ పెళ్లి చేసుకోబోతుందని వీరి నిశ్చితార్థం డిసెంబర్ నెలలో జరగబోతుందని వెల్లడించారు.

ఇక కంగన వివాహం వచ్చే ఏడాది ఏప్రిల్ నెలలో జరుగుతుందని కె ఆర్ కె ఈ సందర్భంగా చేసినటువంటి ట్వీట్ ప్రస్తుతం వైరల్ అవుతుంది. మరి ఈ వార్తలలో ఎంతవరకు నిజం ఉంది, లేదంటే ఇది కూడా ఆయన ఊహగానమా అనే విషయం తెలియదు కానీ ప్రస్తుతం ఈ వార్త వైరల్ గా మారడంతో అందరూ షాక్ అయ్యారు. ఇక ఈ మధ్యకాలంలో కంగనా బాలీవుడ్ సినిమాలను కాస్త పక్కన పెట్టారనే తెలుస్తుంది.

ప్రస్తుతం ఈమె వరస సౌత్ సినిమాలలో నటిస్తూ ప్రేక్షకులను సందడి చేస్తున్నారు. తాజాగా చంద్రముఖి 2 సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ సినిమా మరి కొన్ని గంటలలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈమె ఇదివరకే ప్రభాస్ తో నటించిన ఏక్ నిరంజన్ సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చారు. అయితే చాలా సంవత్సరాల తర్వాత తిరిగి చంద్రముఖి 2 సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు ఇందులో ఈమె చంద్రముఖి పాత్రలో నటిస్తున్నారు.

‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ ప్రియాంక జైన్ గురించి 10 ఆసక్తికర విషయాలు..!

‘బిగ్ బాస్ 7’ కంటెస్టెంట్ దామిని భట్ల గురించి 10 ఆసక్తికర విషయాలు!
‘బిగ్ బాస్ 7’ 14 మంది కంటెస్టెంట్స్ పారితోషికాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus