Kangana Ranaut: అంతసేపు కూర్చుని సినిమా చూడటం కష్టమన్న కంగన

కంగన రనౌత్‌ను బాలీవుడ్‌లో అందరూ ఫైర్‌ బ్రాండ్‌ అంటుంటారు. విషయం ఏదైనా తనదైన శైలిలో లాజిక్‌ పాయింట్లు తీసి మాట్లాడుతుంటుంది. అలాంటి ఆమెకు బలహీనతలు ఉన్నాయి అంటే నమ్మగలమా. కొంతమంది నమ్మకపోవచ్చు కానీ… కంగనకు కూడా బలహీనలు ఉన్నాయి. అయితే సగటు మహిళలకు ఉండే బలహీనతలే కావడం గమనార్హం. అంతేకాదు వరుస సినిమాలతో బిజీగా ఉండే… కంగనకు సినిమాలు చూడటం అంటే అస్సలు నచ్చదట. ఇంకా ఆమెగురించి కొన్ని విషయాలు ఆమె మాటల్లో…

కంగన ఎక్కడికెళ్లినా విపరీతంగా దుస్తులు కొనేస్తుంటదట. షాపింగ్‌లో ఎంత డబ్బు ఖర్చుపెడుతుందో కూడా ఆలోచించదట. అలాగే బంగారం అన్నా ఇష్టమే అయితే మరీ అంత వ్యామోహం లేదట. అయితే బంగారం కొనడం అంటే చెప్పలేనంత ఇష్టమట. కంగన ఇంటికెళ్తే ఇల్లంతా రకరకాల కళాకృతులూ, చిత్రాలూ, ఫొటోలు కనిపిస్తాయి. అక్కడ కూడా తన ట్రేడ్‌ మార్క్‌ చూపిస్తుంది. అంటే.. ఆమె ఇంట్లో ఉన్న కళాకృతులు మహిళా కళాకారులు తయారుచేసినవే కావడం గమనార్హం.

కంగన గురించి ఈ విషయం చెబితే నమ్మరు కానీ… ఆమె ఇప్పటివరకూ చూసిన సినిమాలు గట్టిగా ఓ పది ఉంటాయట. మూడుగంటల సేపు కదలకుండా ఒకే దగ్గర కూర్చుని సినిమా చూడటం అంటే ఆమెకు నచ్చదట. అంతేకాదు టీవీ చూస్తూ కాలక్షేపం చేయడం కూడా ఇష్టపడదట. ఎప్పుడైనా బోర్‌కొడితే పుస్తకాలు చదువుకుంటుందట. పాటలు వినడానికి ఇష్టపడతుందట. ఎంతగా ఇష్టం అంటే… గంటలతరబడి పాటలు అలా వింటూ ఉంమన్నా… ఓకే నట.

Most Recommended Video

‘వకీల్ సాబ్ ‘ నుండీ ఆకట్టుకునే 17 పవర్ ఫుల్ డైలాగులు!
ఈ 10 మంది టాలీవుడ్ హీరోలకి బిరుదులు మార్చిన సినిమాల లిస్ట్..!
లాయర్ గెటప్ లలో ఆకట్టుకున్న 12 మంది హీరోలు వీళ్ళే..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus