Kangana Ranaut: మా మనసులు సంతోషంతో నిండిపోయాయి… కంగనా పోస్ట్ వైరల్!

బాలీవుడ్ ఇండస్ట్రీలో నటిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటినటి కంగనా రౌనత్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే ఈమె సినిమాల ద్వారా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నప్పటికీ అదే స్థాయిలో వివాదాల ద్వారా కూడా వార్తల్లో నిలుస్తుంటారు. ఏ విషయం అయినా చాలా ముక్కుసూటిగా మాట్లాడే కంగనా తన వ్యాఖ్యల ద్వారా వార్తల్లో నిలుస్తూ ఉంటారు. ఇలా ఇండస్ట్రీకి సంబంధించిన విషయాలు గురించి మాత్రమే కాకుండా రాజకీయాలకు సంబంధించిన విషయాల గురించి కూడా మాట్లాడుతూ తన అభిప్రాయాలను తెలియజేస్తూ ఉంటారు.

అయితే ప్రస్తుత కాలంలో ఈమె (Kangana Ranaut) బాలీవుడ్ సినిమాల కన్నా కోలీవుడ్ సినిమాలపైనే ఆసక్తి చూపుతూ ఎక్కువగా కోలీవుడ్ సినిమాలలో నటిస్తూ బిజీగా ఉన్నారు. ఇదిలా ఉండగా తాజాగా ఈమె సోషల్ మీడియా వేదికగా చేసిన పోస్టులు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. తన సోదరుడు అక్షత్ రౌనత్, రీతు రౌనత్ దంపతులు త్వరలోనే తల్లిదండ్రులు కాబోతున్నారు. ఈ క్రమంలోనే తన వదిన రీతూ సీమంతపు వేడుకలను ఎంతో ఘనంగా నిర్వహించారు.

ఈ క్రమంలోనే ఈ సీమంతపు వేడుకలకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ ఎంతో సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కంగనా తల్లి తన వదినకు బంగారు కానుకలు అందజేశారు. అదే విధంగా కంగనా సైతం తన వదిన కోసం ప్రత్యేకంగా బంగారు ఆభరణాలను కానుకగా అందజేస్తూ ఉన్నటువంటి ఫోటోలను ఈమె సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు. ఇక ఈ ఫోటోలను షేర్ చేసిన ఈమె తన సంతోషాన్ని వ్యక్తం చేశారు.

మా మనసులు సంతోషంతో నిండిపోయాయి. బేబీ రౌనత్ కోసం ఎదురు చూస్తున్నాము.శుభాకాంక్షలు తెలియజేసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అంటూ తన వదిన బేబీ షవర్ వేడుకలకు సంబంధించిన ఫోటోలను షేర్ చేయడంతో ఇవి కాస్త వైరల్ అవుతున్నాయి.

హిడింబ సినిమా రివ్యూ & రేటింగ్!

అన్నపూర్ణ ఫోటో స్టూడియో సినిమా రివ్యూ & రేటింగ్!
హత్య సినిమా రివ్యూ & రేటింగ్

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus