Kangana,Mahesh: మహేష్ మాటల్లో తప్పేముంది..? కంగనా వ్యాఖ్యలు!

బాలీవుడ్ తనను భరించలేదంటూ ఇటీవల మహేష్ బాబు కొన్ని కామెంట్స్ చేసిన సంగతి తెలిసిందే. ఈ విషయంలో కొందరు మహేష్ బాబుని సపోర్ట్ చేస్తున్నారు. మహేష్ చేసిన వ్యాఖ్యలను వివాదాస్పదం చేయక్కర్లేదంటూ బాలీవుడ్ ప్రముఖులు స్పందిస్తున్నారు. మహేష్ చేసిన కామెంట్స్ ఆయన వ్యక్తిగతమని.. వాటిని నెగెటివ్ గా తీసుకొని వివాదం చేయక్కర్లేదని అంటున్నారు. నటి కంగనా రనౌత్ కూడా మహేష్ కి మద్దతు తెలుపుతూ మాట్లాడింది. మహేష్ చేసిన కామెంట్స్ ఏ సెన్స్ లో చేశారో తనను తెలియదని..

అయితే ఆయన మాటల్లో తప్పేముందని ప్రశ్నించింది కంగనా. మహేష్ మంచి నటుడని.. ఆయన జెనరేషన్ టాలీవుడ్ హీరోలు తెలుగు సినిమా ఇండస్ట్రీని నెంబర్ వన్ పొజిషన్ లోకి తీసుకొచ్చారని కంగనా చెప్పుకొచ్చింది. టాలీవుడ్ లోనే మహేష్ కి కంఫర్ట్ అనిపించి.. బాలీవుడ్ వైపు రాకపోయి ఉండవచ్చని.. ఈ విషయంలో బాలీవుడ్ తనను భరించలేదని అనుకోవడంలో విడ్డూరం లేదని కంగనా వ్యాఖ్యానించింది. బాలీవుడ్ జనాలు కొందరు హాలీవుడ్ తమను భరించలేదని తత్వంతో ఉంటారని కంగనా చమత్కరించింది.

భాషాపరమైన విబేధాలు సరికాదని కంగనా చెప్పుకొచ్చింది. మహేష్ బాబుని ప్రశంసిస్తూ.. ఆయన వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగతమని.. వాటిని వివాదం చేయొద్దని తెలిపింది. ఇటీవల జరిగిన ‘మేజర్’ సినిమా ప్రెస్ మీట్ లో మహేష్ బాబు ఈ తరహా కామెంట్స్ చేశారు. దీన్ని బాలీవుడ్ మీడియా తప్పుగా రాయడంతో మహేష్ వివరణ కూడా ఇచ్చారు. తను చెప్పిన కాంటెక్స్ట్ వేరని.. తప్పుగా అర్ధం చేసుకొని రాశారని తెలిపారు.

సర్కారు వారి పాట సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

10 ఏళ్ళ ‘గబ్బర్ సింగ్’ గురించి 12 ఆసక్తికరమైన విషయాలు..!
‘చెల్లమ్మ’ టు ‘మ మ మహేషా’.. జోనిత గాంధీ పాడిన 10 సూపర్ హిట్ పాటల లిస్ట్..!
ఎన్టీఆర్- బాలయ్య టు చిరు-చరణ్… నిరాశపరిచిన తండ్రీకొడుకులు కాంబినేషన్లు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus