Kangana, Priyanka: ఆ స్టార్ హీరోతో ఫ్రెండ్‌షిప్ వల్లే ప్రియాంక చోప్రాను అతను బ్యాన్ చేశాడంటూ కంగనా రనౌత్ షాకింగ్ కామెంట్స్..!

రాజకీయాల కారణంగానే బాలీవుడ్ ఇండస్ట్రీకి గుడ్ బై చెప్పానంటూ స్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్రా చేసిన కామెంట్స్ గురించి చిత్ర పరిశ్రమలో పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్నాయి.. ఆమెకు వివేక్ అగ్నిహోత్రి, కంగనా రనౌత్ లాంటి వారు మద్దతు తెలుపుతుంటే.. మరికొందరు మాత్రం.. ప్రియాంక కావాలనే తాను బాధితురాలినని చెప్పి, అందరి మన్ననలు పొందాలని చూస్తుందంటూ కామెంట్స్ చేస్తున్నారు.. బాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్ అయ్యిండి.. ఉన్నట్టుండి హాలీవుడ్‌కి ఎందుకు మారాల్సి వచ్చిందోననే ఆసక్తికర విషయాలను రీసెంట్‌గా షేర్ చేసుకుంటూ..

హిందీ ఇండస్ట్రీ గురించి షాకింగ్ కామెంట్స్ చేసింది ప్రియాంక.. ‘బాలీవుడ్‌లో కొందరు నన్ను ఓ మూలకు నెట్టేయాలని చూశారు.. నాకు ఆఫర్స్ రాకుండా చేయడానికి ఓ గ్రూప్ ఫామ్ అయింది.. అందులో భాగంగా నాకు కొందరితో విబేధాలు వచ్చాయి.. ఆ రాజకీయాలు నేను భరించలేక హాలీవుడ్‌కి వచ్చేశాను’ అని చెప్పింది..తాజాగా ప్రియాంక చోప్రాకి మద్దతుగా మాట్లాడి మరోసారి పరిశ్రమలో దుమారం రేపి వార్తల్లో నిలిచింది ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్..

‘బాలీవుడ్‌లో కొందరు గ్యాంగ్‌గా మారి ప్రియాంకను అవమానించారు.. ఆమె ఇండస్ట్రీ నుండి పారిపోయేలా చేశారు.. స్వయంకృషితో ఎదిగిన మహిళను భారత్ వదిలి వెళ్లిపోయేలా చేశారు.. కరణ్ జోహార్ ఆమెను బ్యాన్ చేశాడనే సంగతి అందరికీ తెలిసిందే.. షారుఖ్ ఖాన్‌తో ప్రియాంక చోప్రా స్నేహం చేయడం కరణ్‌కి నచ్చలేదు.. అందుకే ఆమెను దూరం పెట్టారు.. ఈ విషయం గురించి అప్పట్లో మీడియాలో ఎన్నో కథనాలు వచ్చాయి..

ఆమె (Kangana) దేశం వదిలి వెళ్లిపోయే వరకు వేధించారు.. సినీ పరిశ్రమ వాతావరణాన్ని, సంసృతినీ నాశనం చేసినందుకు అతను బాధ్యత వహించాలి.. అమితాబ్ బచ్చన్, షారుఖ్ ఖాన్ లాంటి వాళ్లు సినిమాల్లోకి వచ్చిన రోజుల్లో ఇలాంటి పరిస్థితులు లేవు’ అంటూ కంగనా  ట్వీట్ చేసింది.. ప్రియాంకకు మద్దతుగా ఆమె  చేసిన కామెంట్స్.. మీడియాతో పాటు సోషల్ మీడియాలోనూ వైరల్ అవుతున్నాయి.. ఈ వివాదం ఎంత దూరం వెళ్తుందో చూడాలి..


హీలీవుడ్‌లో నటించిన 15 మంది ఇండియన్ యాక్టర్స్ వీళ్లే..!
టాలీవుడ్‌లో గుర్తింపు తెచ్చుకున్న 10 మంది కోలీవుడ్ డైరెక్టర్స్ వీళ్లే..!

తు..తు…ఇలా చూడలేకపోతున్నాం అంటూ…బాడీ షేమింగ్ ఎదురుకున్న హీరోయిన్లు వీళ్ళే
నాగ శౌర్య నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus