కోలీవుడ్ స్టార్ హీరో సూర్య ( Suriya) , దర్శకుడు ‘సిరుతై’ శివ (Siva) కాంబినేషన్లో తెరకెక్కిన ‘కంగువా’ (Kanguva) చిత్రం నవంబర్ 14న విడుదలై డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది. భారీ అంచనాల నడుమ రిలీజ్ అయిన ఈ సినిమా .. ఆ అంచనాలు అందుకోలేదు. నిర్మాత జ్ఞానవేల్ రాజా (K. E. Gnanavel Raja) ఈ చిత్రానికి ఏకంగా రూ.2000 కోట్లు కలెక్షన్స్ వస్తాయని చెప్పారు. మొదటి రోజు కొంచెం పర్వాలేదు అనిపించినా.. రెండో రోజు నుండి బాగా డౌన్ అయ్యింది.
12 నిమిషాల పాటు ట్రిమ్ చేసినా ఆడియన్స్ ఆసక్తి చూపించడం లేదు. వీకెండ్ కంటే కూడా మొదటి సోమవారం నాడు ఎక్కువ డ్రాప్స్ కనిపించాయి. ఒకసారి 5 డేస్ కలెక్షన్స్ ని గమనిస్తే :
నైజాం | 2.86 cr |
సీడెడ్ | 1.03 cr |
ఉత్తరాంధ్ర | 1.17 cr |
ఈస్ట్ | 0.37 cr |
వెస్ట్ | 0.24 cr |
గుంటూరు | 0.31 cr |
కృష్ణా | 0.48 cr |
నెల్లూరు | 0.15 cr |
ఏపీ + తెలంగాణ (టోటల్) | 6.61 cr |
‘కంగువా’ చిత్రానికి రూ.13 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కావాలంటే రూ.14 కోట్ల వరకు షేర్ ను రాబట్టాలి. 5 రోజులు పూర్తయ్యేసరికి ఈ సినిమా రూ.6.61 కోట్ల షేర్ ను మాత్రమే రాబట్టింది. బ్రేక్ ఈవెన్ కోసం మరో రూ.7.39 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. మొదటి సోమవారం రూ.50 లక్షల లోపే ఈ సినిమా షేర్ వచ్చింది. సో ఇక బ్రేక్ ఈవెన్ అయ్యే ఛాన్స్ లేనట్టే అని చెప్పాలి.