Kanguva: కంగువా.. తెలుగులో 100 కోట్ల ఆశ!

తమిళ్ స్టార్ హీరో సూర్యకి (Suriya) ‘గజినీ’ తరువాత తెలుగులో విపరీతమైన క్రేజ్ పెరిగింది. ‘సింగం’ (Singam) సిరీస్ లాంటి సినిమాలతో ఆయన మార్కెట్ పరంగా కూడా మరో లెవెల్ కు వెళ్లారు. ‘జై భీమ్’ మరియు ‘ఆకాశం నీ హద్దురా’ చిత్రాలు కూడా ఓటీటీలో మంచి ఆదరణ పొందాయి. ఈ నేపథ్యంతో సూర్యకి తెలుగులో మంచి ఫాలోయింగ్ ఉంది. అయితే, ఇటీవల థియేటర్లలో విడుదలైన సూర్య సినిమాలు పెద్ద విజయాలు సాధించకపోవడంతో కొంత మార్కెట్ తగ్గింది.

Kanguva

ఇప్పుడేమో ‘కంగువా’ (Kanguva) సినిమాతో సూర్య మళ్లీ తన క్రేజ్ ను పెంచుకోవాలని చూస్తున్నాడు. శివ (Siva) దర్శకత్వంలో పాన్ వరల్డ్ స్థాయిలో రూపొందిన ఈ సినిమా మంచి హైప్ తో నవంబర్ 14న విడుదలకు సిద్ధమవుతోంది. ఈ చిత్రం డిఫరెంట్ కాన్సెప్ట్ తో దర్శకుడు శివ రూపొందించారు. ఇక టీజర్ కి పాజిటివ్ రెస్పాన్స్ రావడంతో సినీ పండితుల్లో ఆసక్తిని పెంచింది. వరల్డ్ వైడ్ గా 1000 కోట్ల కలెక్షన్స్ కొల్లగొడుతుందని అభిమానులు భావిస్తున్నారు.

తెలుగులో ‘కంగువా’కి భారీ కలెక్షన్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు. గతంలో కేజీఎఫ్ చాప్టర్ 2 డబ్బింగ్ గా విడుదలై టాలీవుడ్ లో 136.85 కోట్లను వసూలు చేసింది. రజినీకాంత్  (Rajinikanth)  జైలర్ (Jailer) మూవీ కూడా తెలుగులో 60 కోట్ల కలెక్షన్స్ అందుకుంది. ‘కంగువా’ మూవీకి ఉన్న క్రేజ్ ని దృష్టిలో ఉంచుకుంటే, జైలర్ కలెక్షన్లను దాటే అవకాశం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

పాజిటివ్ టాక్ వస్తే ‘కంగువా’ తెలుగులో 100 కోట్ల క్లబ్ లో చేరే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. ఇప్పటికే యూవీ క్రియేషన్స్ ఈ చిత్రాన్ని తెలుగులో బాగా ప్రమోట్ చేస్తోంది. సూర్య కూడా వరుస ఇంటర్వ్యూలు ఇస్తూ సినిమాపై ఆసక్తి పెంచుతున్నారు. ఈవెంట్ నిర్వహించి అభిమానులను ఆకర్షిస్తున్నారు. ఇవన్నీ కలిస్తే, కంగువా తెలుగు బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సాధించే చాన్స్ ఉంది.

అమరన్.. సాయి పల్లవి చేసిన ఆ పాత్ర వెనుక పెద్ద కథే ఉంది!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus