అంత ఎదిగిపోయావా.. రష్మిక

తెలుగులో చేసిన సినిమాల సంఖ్య తక్కువే అయినా.. చేసిన ప్రతీ సినిమా హిట్టవ్వడంతో మంచి క్రేజ్ సంపాదించుకుంది రష్మిక. అయితే అనుకోని విధంగా అనేక వివాదాల్లో కూడా ఇరుక్కుంది రష్మిక. కన్నడలో చేసిన మొదటి సినిమాతోనే స్టార్ హీరోయిన్ అయిన రష్మిక.. రోహిత్ శెట్టి తో నిశ్చితార్థం కూడా చేసేసుకుంది. కొన్ని రోజుల్లో పెళ్ళని కూడా ప్రకటించేసింది. అయితే ఆ తరువాత తెలుగులో వరుస అవకాశాలు రావడంతో.. నిశ్చితార్థం క్యాన్సిల్ చేసుకుందని ప్రచారం జరిగింది. ఆ తరువాత ఆ ప్రచారమే నిజమైంది అనుకోండి. ఇక అటుతరువాత రష్మిక కన్నడ సినిమాల్లో నటించనందని.. ‘తెలుగు సినిమాలకి ఎక్కువ పారితోషికం లభిస్తుంది కాబట్టి కన్నడ సినిమాలు చేయనందని’ కథనాలు పుట్టుకొచ్చాయి. అయితే వాటిలో నిజం లేదని రష్మిక తేల్చి చెప్పేసింది.

కన్నడ సినిమాలకు కూడా తాను ప్రాధాన్యత ఇస్తున్నాను అంటూ క్లారిటీ ఇచ్చింది. అంతా బానే ఉంది.. ఇప్పుడు ఏకంగా మహేష్ బాబు లాంటి స్టార్ హీరో సినిమాలో నటిస్తుంది అనుకుంటే.. రష్మిక మరో వివాదంలో చిక్కుకుంది. విషయం ఏమిటంటే ఇటీవల… ‘నేను కన్నడలో మాట్లాడలేకపోతున్నాను’ అంటూ రష్మిక కామెంట్ చేయడం పెద్ద దుమారం రేగింది. ‘మాతృభాష ని మరిచిపోయేంత ఎదిగిపోయావా’ అంటూ కన్నడ సినీ ప్రేక్షకులు ఆమె పై విరుచుకుపడుతున్నారు. మరి వీటికి రష్మిక ఎలా స్పందిస్తుందో చూడాలి.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus