పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్లో వస్తున్న మూడో మూవీ పనులు ఊపందుకున్నాయి. ప్రస్తుతం డాలీ దర్శకత్వంలో “కాటమరాయుడు” చిత్రీకరణలో బిజీగా ఉన్న పవన్ తర్వాతి సినిమా వచ్చే నెల సెట్స్ మీదకు వెళ్ళడానికి ప్లాన్ చేస్తున్నారు. త్రివిక్రమ్ అంతే వేగంగా ఆర్టిస్టులు, టేక్నీషియన్ల ఎంపిక పూర్తి చేశారు. కొన్ని రోజుల క్రితం సంగీత దర్శకుడుగా అనిరుద్ ని ఫిక్స్ చేయగా, కెమెరామెన్ గా ప్రముఖ ఫోటో గ్రాఫర్ పీసీ శ్రీరామ్ ని ఖరారు చేశారు. హారిక హాసిని క్రియేషన్స్ సంస్థ నిర్మించే ఈ చిత్రంలో కథానాయికలుగా నేను శైలజ ఫేమ్ కీర్తి సురేష్, అను ఇమ్మాన్యుయెల్ ని తీసుకున్నారు.
తాజాగా కన్నడ స్టార్ హీరో ఉపేంద్రను హైర్ చేసుకున్నారు. ఈయన ఒక కీలకరోల్ పోషించనున్నట్లు సమాచారం. గతంలో త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కిన సన్నాఫ్ సత్యమూర్తి సినిమాలో కనిపించిన ఉపేంద్ర మరోసారి ఆయన డైరక్షన్లో నటించనున్నారు. జల్సా, అత్తారింటికి దారేది సినిమాల తర్వాత పవన్, త్రివిక్రమ్ కాంబినేషన్లో వస్తున్న మూవీ కావడంతో దీనిపై భారీ అంచనాలున్నాయి.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.