Kannappa: కన్నప్ప లీక్‌పై 5 లక్షల బహుమతి!

పాన్‌ ఇండియా స్టార్‌ ప్రభాస్‌ (Prabhas)  కీలక పాత్రలో నటిస్తున్న భారీ ప్రాజెక్ట్‌ “కన్నప్ప”కి (Kannappa) సంబంధించి ఓ ఫోటో సోషల్‌ మీడియాలో లీక్‌ కావడం టీమ్‌ను తీవ్రంగా నిరాశ పరిచింది. ఎనిమిదేళ్ల నుంచి ఎంతో కష్టపడి ఈ ప్రాజెక్ట్‌పై పని చేస్తూ వస్తున్నామని, ప్రాజెక్ట్ సమగ్రతను కాపాడేందుకు అభిమానుల మద్దతు కావాలని కన్నప్ప టీమ్‌ విజ్ఞప్తి చేసింది. ఈ లీక్ కారణంగా 2,000 మందికి పైగా VFX కళాకారుల జీవనాధారంపై కూడా ప్రభావం పడుతుందని టీమ్‌ తెలిపింది.

Kannappa

పోలీసు కేసు పెట్టడం కూడా జరుగుతుంది.. లీక్ అయిన ఫోటోను షేర్ చేసే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని, అందుకే అభిమానులు ఈ ఫోటోను షేర్ చేయకుండా సహకరించాలని కోరారు. ఇక లీక్‌ చేసిన వ్యక్తులను గుర్తిస్తే వారికి 5,00,000 రూపాయల బహుమతి ఉంటుందని చెప్పడం విశేషం. లీక్ చేసిన వారి గురించి తెలిస్తే 24 ఫ్రేమ్స్‌ ఫ్యాక్టరీ ట్విట్టర్‌ అకౌంట్‌కు తెలియజేయాలని టీమ్‌ కోరుతోంది.

సినిమా సమగ్రతను కాపాడేందుకు అభిమానుల సహకారం ఎంతో అవసరమని, ఈ విజ్ఞప్తిని ఎమోషనల్ గా తెలియజేశారు. కన్నప్ప సినిమాలో ప్రభాస్ నందీశ్వరుడి పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఇక ఉదయం నుంచి ఆ పాత్రకు సంబంధించిన ఫొటో ఒకటి వైరల్ కావడంతో ఫ్యాన్స్ షాక్ అయ్యారు. ఇక ఈ సినిమాలో అక్షయ్ కుమార్  (Akshay Kumar), మోహన్ బాబు (Mohan Babu) , మోహన్ లాల్ (Mohanlal)  వంటి అగ్ర నటులు కూడా ముఖ్యమైన పాత్రల్లో నటిస్తున్నారు.

మొదట అనుకున్న ప్లాన్ ప్రకారం సినిమాను డిసెంబర్ లో విడుదల చేయాలి. అయితే రిలీజ్ వాయిదా పడే అవకాశం ఉన్నట్లు టాక్ ఎంత వైరల్ అవుతున్నా కూడా మేకర్స్ ఇంకా ఆ విషయంలో సరైన క్లారిటీ ఇవ్వలేదు. మరి రిలీజ్ విషయంలో ఎప్పుడు క్లారిటీ ఇస్తారో చూడాలి.

రానా దర్శకుడి కొత్త ప్రయోగం.. వర్కౌట్ అవుతుందా?

 

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus