‘కాంతార’ ఈ ఒక్క చిత్రంతో దేశవ్యాప్తంగా పాపులర్ అయిపోయాడు కన్నడ హీరో రిషబ్ శెట్టి. ఈ చిత్రంలో హీరోగా నటించడమే కాకుండా.. దర్శకుడిగా కూడా తన పనితనాన్ని దేశం మొత్తం చూపించాడు.’కె.జి.ఎఫ్'(సిరీస్) నిర్మాతలైన ‘హోంబలే ఫిలింస్’ వారు ఈ చిత్రాన్ని నిర్మించారు.కేవలం రూ.16 కోట్ల బడ్జెట్ తో ఈ చిత్రం రూపొందింది. అయితే బాక్సాఫీస్ వద్ద ఎవ్వరూ ఊహించని విధంగా రూ.250 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. సెప్టెంబర్ 30న కన్నడంలో రిలీజ్ అయిన ఈ మూవీ సూపర్ హిట్ టాక్ ను సొంతం చేసుకోవడంతో పాటు అక్కడ రూ.100 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టి చరిత్ర సృష్టించింది.
ఇక అక్టోబర్ 15న తెలుగుతో పాటు హిందీలో కూడా రిలీజ్ అయిన ఈ మూవీ అక్కడ కూడా అదరగొట్టేస్తుంది అనే చెప్పాలి. తెలుగులో ఈ చిత్రం రూ.25 కోట్ల షేర్ ను సాధించే దిశగా దూసుకుపోతుంది. ఇదిలా ఉండగా.. ‘కాంతార’ హీరో అయిన రిషబ్ శెట్టి ఓ తెలుగు సినిమాలో కూడా నటించాడు అన్న విషయం చాలా మందికి తెలిసుండదు. అవును రిషబ్ శెట్టి తెలుగు సినిమాలో కూడా నటించాడు. అయితే అది చాలా చిన్న పాత్ర. వివరాల్లోకి వెళితే..
తాప్సి ప్రధాన పాత్రలో ‘ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ’ దర్శకుడు స్వరూప్ ఆర్.ఎస్.జె తెరకెక్కించిన ‘మిషన్ ఇంపాజిబుల్’ అనే చిత్రం ఈ ఏడాది అంటే ఏప్రిల్ 1న రిలీజ్ అయ్యింది. ఈ మూవీలో ఓ సన్నివేశంలో రిషబ్ శెట్టి కనిపిస్తాడు.’మిషన్ ఇంపాజిబుల్’ చిత్రంలో అతను ఖలీల్ అనే పాత్రను పోషించాడు.
సందీప్ రాజ్, సుహాస్ లతో కలిసి ముగ్గురు పిల్లల్ని మోసం చేసే వ్యక్తిగా అతను కనిపిస్తాడు. ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషించిన ఆ ముగ్గురు పిల్లలు రిషబ్ శెట్టితో రఘుపతి,రాఘవ,రాజారం ఆర్.ఆర్.ఆర్ అంటూ తమ పేర్లు చెబుతుంటే రిషబ్ శెట్టి ఖలీల్, జిలాని, ఫరూక్ కె.జి.ఎఫ్ అంటూ సమాధానం ఇస్తున్న వీడియోని ‘మిషన్ ఇంపాజిబుల్’ ట్రైలర్లో కూడా హైలెట్ చేశారు .
‘పుష్ప 2’ తో పాటు 2023 లో రాబోతున్న సీక్వెల్స్!
చిరు టు వైష్ణవ్.. ఓ హిట్టు కోసం ఎదురుచూస్తున్న టాలీవుడ్ హీరోల లిస్ట్..!
రూ.200 కోట్లు టు రూ.500 కోట్ల బడ్జెట్ తో రూపొందిన ఇండియన్ సినిమాల లిస్ట్..!