కన్నడలో సెప్టెంబర్ చివర్లో రిలీజ్ అయిన ‘కాంతార’ చిత్రం… అక్టోబర్ 15న తెలుగుతో పాటు పలు భాషల్లో రిలీజ్ అయ్యింది. రిషబ్ శెట్టి నటించి, డైరెక్ట్ చేసిన ఈ చిత్రాన్ని తెలుగు రాష్ట్రాల్లో ‘గీతా ఆర్ట్స్’ సంస్థ రిలీజ్ చేసింది. మొదటి రోజే ఈ మూవీ సూపర్ హిట్ టాక్ ను సొంతం చేసుకుంది.క్రిటిక్స్ అయితే ఈ మూవీతో లవ్ లో పడిపోయినట్టు రేటింగ్ లు ఇచ్చారు. మొదటి రోజు మార్నింగ్ షోలు మ్యాట్నీలు కాస్త డల్ గా స్టార్ట్ అయినా ఈవెనింగ్ షోల నుండి ఈ మూవీ కుమ్మేస్తుంది అని చెప్పాలి.
ఆ జోరు ఇప్పటికీ తగ్గలేదు. మూడో వీకెండ్ ను కూడా ఈ మూవీ బాగా క్యాష్ చేసుకుంది. ఒకసారి 16 డేస్ కలెక్షన్స్ ని గమనిస్తే :
నైజాం | 7.76 cr |
సీడెడ్ | 2.43 cr |
ఉత్తరాంధ్ర | 2.60 cr |
ఈస్ట్ | 1.59 cr |
వెస్ట్ | 1.02 cr |
గుంటూరు | 1.24 cr |
కృష్ణా | 1.29 cr |
నెల్లూరు | 0.77 cr |
ఏపీ + తెలంగాణ (టోటల్) | 20.70 cr |
రెస్ట్ ఆఫ్ ఇండియా + ఓవర్సీస్ |
0.21 cr |
వరల్డ్ వైడ్ (టోటల్) | 20.91 cr (షేర్) |
‘కాంతార’ చిత్రానికి రూ.1.65 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ మూవీ బ్రేక్ ఈవెన్ అవ్వాలి అంటే రూ.2 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. మొదటి రోజే బ్రేక్ ఈవెన్ సాధించిన ఈ మూవీ 16 రోజులు పూర్తయ్యేసరికి రూ.20.91 కోట్ల షేర్ ను రాబట్టింది. దీంతో బయ్యర్స్ కు రూ.18.91 కోట్ల భారీ లాభాలను అందించింది.
నిన్న కూడా ఈ మూవీ రూ.1.8 కోట్ల పైనే షేర్ ను అందించింది. ఈ వారం కూడా సినిమాలు లేవు కాబట్టి.. ఓటీటీ రిలీజ్ అయ్యే వరకు ‘కాంతార’ కుమ్మేసే అవకాశం ఉంది.
Most Recommended Video
‘పుష్ప 2’ తో పాటు 2023 లో రాబోతున్న సీక్వెల్స్!
చిరు టు వైష్ణవ్.. ఓ హిట్టు కోసం ఎదురుచూస్తున్న టాలీవుడ్ హీరోల లిస్ట్..!
రూ.200 కోట్లు టు రూ.500 కోట్ల బడ్జెట్ తో రూపొందిన ఇండియన్ సినిమాల లిస్ట్..!