Kantara Collections: 19 వ రోజు కూడా సూపర్ గా కలెక్ట్ చేసిన ‘కాంతార’ ..!

కన్నడలో సెప్టెంబర్ చివర్లో రిలీజ్ అయిన ‘కాంతార’ చిత్రం… అక్టోబర్ 15న తెలుగుతో పాటు పలు భాషల్లో రిలీజ్ అయ్యింది. రిషబ్ శెట్టి నటించి, డైరెక్ట్ చేసిన ఈ చిత్రాన్ని తెలుగు రాష్ట్రాల్లో ‘గీతా ఆర్ట్స్’ సంస్థ రిలీజ్ చేసింది. మొదటి రోజే ఈ మూవీ సూపర్ హిట్ టాక్ ను సొంతం చేసుకుని బ్రేక్ ఈవెన్ సాధించింది. ఆ జోరు ఇప్పటికీ తగ్గలేదు అనే చెప్పాలి. మూడో వారంలోకి ఎంటర్ అయినా బాక్సాఫీస్ వద్ద ఈ మూవీ సూపర్ స్ట్రాంగ్ గా కలెక్ట్ చేస్తుంది.

19 వ రోజు అదీ వీక్ డే అయినప్పటికీ ఈ మూవీ చాలా బాగా కలెక్ట్ చేసింది. తెలుగు సినిమాలే ఇన్ని రోజులు నిలబడకపోతున్న టైంలో డబ్బింగ్ సినిమా ఇంత బాగా కలెక్ట్ చేయడం అంటే మామూలు విషయం కాదు.ఒకసారి 19 డేస్ కలెక్షన్స్ ని గమనిస్తే :

నైజాం 10.99 cr
సీడెడ్ 2.67 cr
ఉత్తరాంధ్ర 2.94 cr
ఈస్ట్ 1.76 cr
వెస్ట్ 1.10 cr
గుంటూరు 1.37 cr
కృష్ణా 1.41 cr
నెల్లూరు 0.82 cr
ఏపీ + తెలంగాణ (టోటల్) 23.06 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా +
ఓవర్సీస్
0.23 cr
వరల్డ్ వైడ్ (టోటల్) 23.29 cr (షేర్)

‘కాంతార’ చిత్రానికి రూ.1.65 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ మూవీ బ్రేక్ ఈవెన్ అవ్వాలి అంటే రూ.2 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. మొదటి రోజే బ్రేక్ ఈవెన్ సాధించిన ఈ మూవీ 19 రోజులు పూర్తయ్యేసరికి రూ.23.29 కోట్ల షేర్ ను రాబట్టింది. దీంతో బయ్యర్స్ కు రూ.21.29 కోట్ల భారీ లాభాలను అందించింది.

నిన్న కూడా ఈ మూవీ రూ.0.60 కోట్ల పైనే షేర్ ను అందించింది. ఈ వారం కూడా పెద్దగా పేరున్న సినిమాలు లేవు కాబట్టి.. ఓటీటీ రిలీజ్ అయ్యే వరకు ‘కాంతార’ కుమ్మేసే అవకాశం ఉంది.

‘ఆర్.ఆర్.ఆర్’ టు ‘కార్తికేయ’ టాలీవుడ్లో అత్యధిక కలెక్షన్లు రాబట్టిన సినిమాలు..!

Most Recommended Video

‘పుష్ప 2’ తో పాటు 2023 లో రాబోతున్న సీక్వెల్స్!
చిరు టు వైష్ణవ్.. ఓ హిట్టు కోసం ఎదురుచూస్తున్న టాలీవుడ్ హీరోల లిస్ట్..!
రూ.200 కోట్లు టు రూ.500 కోట్ల బడ్జెట్ తో రూపొందిన ఇండియన్ సినిమాల లిస్ట్..!

Read Today's Latest Collections Update. Get Filmy News LIVE Updates on FilmyFocus