Kantara: అక్కడ కొత్త రికార్డులు క్రియేట్ చేస్తున్న కాంతార.. కానీ?

2022 సంవత్సరంలో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్లుగా నిలిచిన సినిమాలలో కాంతార సినిమా కూడా ఒకటనే సంగతి తెలిసిందే. ఈ ఏడాది అక్టోబర్ నెలలో గాడ్ ఫాదర్, కాంతార సినిమాలు వారం రోజుల గ్యాప్ లో థియేటర్లలో విడుదలయ్యాయి. గాడ్ ఫాదర్ మూవీ భారీ అంచనాలతో థియేటర్లలో విడుదల కాగా ఈ సినిమాకు ఫస్ట్ వీకెండ్ వరకు బాగానే కలెక్షన్లు వచ్చినా ఫస్ట్ వీకెండ్ తర్వాత ఆశించిన రేంజ్ లో కలెక్షన్లు రాలేదు.

గాడ్ ఫాదర్ సినిమాను నిర్మాతలు సొంతంగా రిలీజ్ చేసుకోవడంతో నిర్మాతలకు ఈ సినిమా ద్వారా ఎక్కువ మొత్తంలో లాభాలు అయితే రాలేదు. అయితే అక్టోబర్ నెల 15వ తేదీన విడుదలైన కాంతార మూవీ పెద్దగా అంచనాలు లేకుండా థియేటర్లలో విడుదలై అంచనాలను మించి సక్సెస్ సాధించింది. తొలిరోజు కలెక్షన్లతోనే ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కాగా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సంచలనాలను కొనసాగిస్తోంది. ఈ మధ్య కాలంలో ఏ సినిమా అందించని స్థాయిలో కాంతార సినిమా నిర్మాతలకు లాభాలను అందిస్తూ

అందరినీ ఆశ్చర్యపరుస్తూ ఉండటం గమనార్హం. నైజాం ఏరియాలో గాడ్ ఫాదర్ ఫుల్ రన్ కలెక్షన్లను అతి త్వరలో కాంతార మూవీ బ్రేక్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. నైజాంలో ఫుల్ రన్ లో గాడ్ ఫాదర్ కేవలం 12 కోట్ల రూపాయల కలెక్షన్లను సొంతం చేసుకుంది. కాంతార ఇప్పటివరకు నైజాంలో 11 కోట్ల రూపాయల కలెక్షన్లను సాధించగా మరికొన్ని రోజుల్లో ఫుల్ రన్ లో ఈ సినిమా మరో 4 కోట్ల రూపాయల కలెక్షన్లను సొంతం చేసుకునే అవకాశాలు అయితే ఉన్నాయని కామెంట్లు వినిపిస్తున్నాయి.

కాంతార గాడ్ ఫాదర్ సినిమాపై పైచేయి సాధిస్తూ అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుండటం గమనార్హం. మరోవైపు చిరంజీవి రీమేక్ సినిమాలకు దూరంగా ఉండాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. కొత్తగా చిరంజీవి ప్రకటించే ప్రాజెక్ట్ లు స్ట్రెయిట్ ప్రాజెక్ట్ లుగా తెరకెక్కితే బాగుంటుందని మరి కొందరు కామెంట్లు చేస్తున్నారు. చిరంజీవి యంగ్ జనరేషన్ దర్శకులకు ఎక్కువగా ఛాన్స్ ఇస్తుండగా 2023 జనవరిలో చిరంజీవి కొత్త ప్రాజెక్ట్ లకు సంబంధించిన ప్రకటనలు వెలువడే ఛాన్స్ అయితే ఉంది.

‘ఆర్.ఆర్.ఆర్’ టు ‘కార్తికేయ’ టాలీవుడ్లో అత్యధిక కలెక్షన్లు రాబట్టిన సినిమాలు..!

Most Recommended Video

‘పుష్ప 2’ తో పాటు 2023 లో రాబోతున్న సీక్వెల్స్!
చిరు టు వైష్ణవ్.. ఓ హిట్టు కోసం ఎదురుచూస్తున్న టాలీవుడ్ హీరోల లిస్ట్..!
రూ.200 కోట్లు టు రూ.500 కోట్ల బడ్జెట్ తో రూపొందిన ఇండియన్ సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus