Kantara: తులు భాషలో విడుదలకు సిద్ధమైన కాంతారా… విడుదల అయ్యేది అప్పుడేనా?

  • November 25, 2022 / 06:35 PM IST

కన్నడ హీరో రిషబ్ శెట్టి దర్శకత్వంలో ఆయన హీరోగా కర్ణాటకలోని తులునాడు, సంస్కృతి సాంప్రదాయాలు నేపథ్యంలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం కాంతార. భూతకోల నృత్య ప్రదర్శన నేపథ్యంలో ఈ సినిమా సెప్టెంబర్ 30వ తేదీ కర్ణాటకలో విడుదలై ఎంతో అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది.ఈ విధంగా కన్నడ భాషలో విడుదలైనటువంటి ఈ సినిమాని తెలుగు తమిళం హిందీ భాషలలో కూడా విడుదల చేశారు.ఇలాఅన్ని భాషలలో ఎంతో అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకున్న

కాంతార సినిమా ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్ వీడియోలో కూడా అందుబాటులోకి వచ్చింది. హోంబలే ఫిలిమ్స్ నిర్మాణ సంస్థ 16 కోట్ల బడ్జెట్ తో ఈ సినిమాని తెరకెక్కించారు. ఇక ఈ సినిమా అన్ని భాషలలో సుమారు 400 కోట్లకు పైగా కలెక్షన్లను రాబట్టి సంచలన రికార్డులను సృష్టించింది. ఈ విధంగా అన్ని భాషలలోనూ ఎంతో అద్భుతమైన విషయాన్ని అందుకున్నటువంటి ఈ సినిమా ఎంతోమంది సినీ రాజకీయ ప్రముఖుల నుంచి ప్రశంసలు అందుకున్నారు.

ఇకపోతే తాజాగా ఈ సినిమా మరొక భాషలో విడుదలకు సిద్ధమవుతోంది.కాంతార సినిమా తాజాగా తులు భాషలో విడుదలై ప్రేక్షకులను సందడి చేయడానికి సిద్ధమైనట్లు సమాచారం. ఈ క్రమంలోనే ఈ సినిమాని డిసెంబర్ రెండవ తేదీ తెలుగు భాషలో విడుదల చేస్తున్నారట ఇప్పటికే ఈ భాషలో ఈ సినిమా డబ్బింగ్ పనులను పూర్తి చేసిన్నట్టు సమాచారం.

ఇక ఈ సినిమా డిసెంబర్ రెండవ తేదీ తెలుగు భాషలో విడుదలై అక్కడ కూడా ఎలాంటి ఆదరణ సంపాదించుకుంటుందో తెలియాల్సి ఉంది. ఈ సినిమా ద్వారా హీరో రిషబ్ శెట్టి పాన్ ఇండియా స్థాయిలో ఎంతో మంచి గుర్తింపు పొందారు.

లవ్ టుడే సినిమా రివ్యూ& రేటింగ్!
తోడేలు సినిమా రివ్యూ & రేటింగ్!

ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం సినిమా రివ్యూ & రేటింగ్!
ఇప్పటి వరకు బాలయ్య పేరుతో వచ్చిన పాటలు ఇవే..

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus