Kantara Collections: 3 ఏళ్ళ ‘కాంతార’ టోటల్ కలెక్షన్స్ ఇవే

రిషబ్ శెట్టి హీరోగా, దర్శకుడిగా రూపొందించిన చిత్రం ‘కాంతార’. సప్తమి గౌడ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో అచ్యుత్ కుమార్ విలన్ గా నటించారు. కన్నడలో సెప్టెంబర్ 30న రిలీజ్ అయ్యింది ఈ సినిమా. అక్కడ మొదటి షోతోనే బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకుంది. అయితే విడుదలైన 2 వారాల తర్వాత అంటే అక్టోబర్ 15న తెలుగుతో పాటు మిగిలిన భాషల్లో రిలీజ్ అయ్యింది.

Kantara Collections

తెలుగులో ఈ చిత్రాన్ని ‘గీతా డిస్ట్రిబ్యూషన్’ సంస్థ రిలీజ్ చేయడం జరిగింది. ఆలస్యంగా రిలీజ్ అవ్వడం వల్ల ‘కాంతార’ తెలుగులో పెద్దగా పెర్ఫార్మ్ చేయలేదులే అని అంతా అనుకున్నారు. కానీ కట్ చేస్తే చిరంజీవి ‘గాడ్ ఫాదర్’ సినిమానే డామినేట్ చేస్తూ భారీ వసూళ్లు రాబట్టింది. లాంగ్ రన్ కూడా పడింది.

తెలుగు రాష్ట్రాల్లో ఫుల్ రన్లో ‘కాంతార’ చిత్రం రూ.50 కోట్ల పైనే గ్రాస్ వసూళ్లను రాబట్టడం విశేషంగా చెప్పుకోవాలి. ఒకసారి ‘కాంతార’ టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ని గమనిస్తే:

నైజాం 12.86 cr
సీడెడ్ 3.23 cr
ఉత్తరాంధ్ర 3.70 cr
ఈస్ట్ 2.16 cr
వెస్ట్ 1.33 cr
గుంటూరు 1.75 cr
కృష్ణా 1.73 cr
నెల్లూరు 0.98 cr
ఏపీ + తెలంగాణ (టోటల్) 27.74 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా +
ఓవర్సీస్
0.23 cr
వరల్డ్ వైడ్ (టోటల్) 27.97 cr (షేర్)

‘కాంతార’ చిత్రం తెలుగు రాష్ట్రాల్లో రూ.2 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగింది. ఫుల్ రన్లో ఈ సినిమా ఏకంగా రూ.27.97 కోట్ల షేర్ ను రాబట్టి చరిత్ర సృష్టించింది. ఓవరాల్ గా రూ.25.97 కోట్ల భారీ లాభాలు పొందింది ఈ సినిమా. అంటే పది రెట్లు పైనే లాభాలు అందించి ఎపిక్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది అని చెప్పాలి.

రెండు రెట్లు పడిపోయాయి.. పెద్ద షాక్ ఇది

Read Today's Latest Collections Update. Get Filmy News LIVE Updates on FilmyFocus