Karan Johar: ‘కాఫీ విత్ కరణ్’ కి ఆ స్టార్ హీరోయిన్ ను మాత్రం తీసుకురాలేకపోయాడట..!

కరణ్ జోహార్.. తెలుగు ప్రేక్షకులకు కూడా ఈ పేరు సుపరిచితమే. మన టాలీవుడ్లో అల్లు అరవింద్, సురేష్ బాబు, దిల్ రాజు ఎలాగో బాలీవుడ్ కు ఈయన అలాగన్నమాట. ఆల్రెడీ మన తెలుగు సినిమాలు ‘బాహుబలి'(సిరీస్) లను హిందీలో గ్రాండ్ గా రిలీజ్ చేశాడు. అవి ఎంత బ్లాక్ బస్టర్లు అయ్యాయో.. ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. కొంత గ్యాప్ తర్వాత ఇప్పుడు ‘లైగర్’ ను నిర్మించి విడుదల చేయబోతున్నారు. ఇక ఈయన గురించి ఇంకా చెప్పాలి అంటే..

బాలీవుడ్లో స్టార్ కిడ్స్ ను ఎక్కువగా తన ‘ధర్మ ప్రొడక్షన్స్’ పైనే లాంచ్ చేస్తూ ఉంటాడు. బాలీవుడ్ పై ఇతనికి బాగా గ్రిప్ ఉంది. అందుకే ఇతను హోస్ట్ చేస్తున్న ‘కాఫీ విత్ కరణ్’ అనే షో బాగా పాపులర్ అయ్యింది. ఈ షోలో ఆయన సెలబ్రిటీస్ ను అడిగే ప్రశ్నలు చాలా ఘోరంగా ఉంటాయి. బెడ్ షేరింగ్ ల గురించి, లవ్ అఫైర్ల గురించి గుచ్చి గుచ్చి అడుగుతుంటాడితను.ఈ షోకి అతను తీసుకురాని స్టార్ అంటూ లేరు అని అంతా అనుకుంటారు.

కానీ కరణ్ మాత్రం ఓ స్టార్ హీరోయిన్ ను తీసుకురాలేకపోయాను అని హర్ట్ అవుతున్నాడు. ఆ స్టార్ హీరోయిన్ మరెవరో కాదు రేఖ. ఈ విషయంపై ఆయన స్పందిస్తూ.. “నా షోకు దూరంగా ఉండాలి అని అనుకునేవారు కూడా ఉన్నారు.ఎంత ప్రయత్నించినా నా షోకి రాను అన్నవారు ఉన్నారా? అంటే రేఖ మేడం విషయంలో అదే జరిగింది. ఆమెను తీసుకురావాలని ఎంతో ప్రయత్నించాను. షో లో ఆమెను కనిపించేలా చేయాలని నాకు చాలా ఆసక్తి ఉండేది.

కానీ, ఆమెను ఒప్పించలేకపోయాను. ఆమె జీవితంలో అందమైన మిస్టరీ ఏదో ఉండి ఉంటుందని నేను అనుకుంటున్నాను. దాన్ని ఎప్పటికీ రక్షించాల్సిన అవసరం ఉండొచ్చు. కనుక ఆ తర్వాత నుంచి నేను ఆమెపై ఒత్తిడి చేయలేదు. అలాగే నా స్నేహితుడు, మార్గదర్శి అయిన ఆదిత్య చోప్రాను కూడా తీసుకురాలేకపోయాను” అంటూ చెప్పుకొచ్చాడు కరణ్ జోహార్.

‘సీతా రామం’ చిత్రానికి సంబంధించి బెస్ట్ డైలాగ్స్..!

Most Recommended Video

తరుణ్,ఎన్టీఆర్ టు కళ్యాణ్ రామ్.. సినిమాల్లో చనిపోయే పాత్రలు చేసిన స్టార్లు..!
చేయని తప్పుకి శాస్త్రవేత్తపై దేశద్రోహి కేసు..!
క్రేజీ ప్రాజెక్టులు పట్టేసిన 10 మంది కొత్త డైరెక్టర్లు.. హిట్లు కొడతారా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus