బాలీవుడ్ లో కొత్తగా వచ్చే వాళ్లను ఎదగనివ్వరని.. వారికి అవకాశాలు రాకుండా చేస్తూ.. వారసత్వ అండ ఉన్న వాళ్లను మాత్రమే సపోర్ట్ చేస్తుంటాడని కరణ్ జోహార్ పై ఆరోపణలు చేస్తుంటారు. గతేడాది సుశాంత్ రాజ్ పుత్ ఆత్మహత్య చేసుకోవడానికి కారణం పరోక్షంగా కరణ్ జోహార్ అంటూ నెటిజన్లు మండిపడ్డారు. దీంతో కరణ్ కొంతకాలంగా సైలెంట్ గా ఉంటున్నారు. సోషల్ మీడియాలో కూడా పెద్దగా యాక్టివ్ గా ఉండడం లేదు. అయితే ఇండస్ట్రీలో కొందరు దర్శకులు మాత్రం కరణ్ జోహార్ ని సపోర్ట్ చేస్తూ మాట్లాడారు.
ఇప్పుడు తనపై ఉన్న ఈ ముద్రని చెరిపేసుకోవడానికో.. లేక ఇతర కారణాలతోనో తెలియదు కానీ కరణ్ ఇప్పుడొక సంచలన ప్రకటనతో మీడియా ముందుకొచ్చాడు. తన సంస్థ ధర్మ ప్రొడక్షన్స్ ద్వారా 14 మంది కొత్త దర్శకులను పరిచయం చేయబోతున్నట్లు ప్రకటించాడు కరణ్ జోహార్. ఆ 14 మందితో కలిసి ఒక ఫోటో, వీడియో షూట్ కూడా చేసి గ్రాండ్ గా ఈ విషయాన్ని వెల్లడించారు. ఒక నిర్మాణ సంస్థ ఒకేసారి 14 మంది కొత్త దర్శకులతో ఒప్పందాలు చేసుకోవడం.. సినిమాలు నిర్మించడానికి రెడీ అవ్వడం అనేది గతంలో ఎప్పుడూ జరగలేదు.
తాను కొత్త వాళ్లకు సపోర్ట్ చేస్తానని చెప్పడానికి కరణ్ ఈ విధంగా అనౌన్స్మెంట్ ఇచ్చి సినిమాలు తీస్తున్నాడని కొందరు మాట్లాడుకుంటున్నారు. ప్రస్తుతం కరణ్ జోహార్ బ్యానర్ లో తెరకెక్కించిన ‘సూర్యవంశీ’, ‘బ్రహ్మాస్త్ర’ లాంటి సినిమాలు ఈ ఏడాదిలో ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. అలానే విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తోన్న ‘లైగర్’ సినిమాపై కూడా కరణ్ జోహార్ పెట్టుబడులు పెట్టారు.
Most Recommended Video
ఏ1 ఎక్స్ ప్రెస్ సినిమా రివ్యూ & రేటింగ్!
షాదీ ముబారక్ సినిమా రివ్యూ & రేటింగ్!
సీత ఆన్ ది రోడ్ సినిమా రివ్యూ & రేటింగ్!