బాహుబలి 3 తీసేందుకు పట్టుదలగా ఉన్న కరణ్ జోహార్

  • May 13, 2017 / 01:41 PM IST

బాహుబలి బిగినింగ్ 600 కోట్లు వసూలు చేస్తే… బాహుబలి కంక్లూజన్ 1300 కోట్లు రాబట్టి 1500  కోట్ల మెయిలు రాయిని చేరుకోవడానికి పరుగులు తీస్తోంది. మొదటి పార్ట్ కంటే రెండో పార్ట్ రెండు రెట్ల కలక్షన్ తీసుకొచ్చింది. మరి బాహుబలి మూడో పార్ట్ ఎంత కలెక్ట్ చేస్తుంది? అంచనాలకు అందడం లేదు కదూ.. ఇదే ఆలోచన ప్రముఖ బాలీవుడ్ ఫిల్మ్ మేకర్ కరణ్ జోహార్ ని నిద్రలేకుండా చేస్తోంది. ఇతనే బాహుబలి 1 , 2 హిందీ వెర్షన్స్ ని రిలీజ్ చేసింది. లాభాలను కూడా బాగానే చూశారు. సో ఇక మూడూ పార్ట్ ని తానే నిర్మించాలని ఫిక్స్ అయ్యారంట. తండ్రి విజయేంద్రప్రసాద్ కథ ఇస్తే మూడో పార్ట్ తీయడానికి తనకు ఎటువంటి అభ్యంతరం లేదని దర్శకధీరుడు రాజమౌళి ఇదివరకే చెప్పారు.

సో ఆకథను డెవలప్ చేయడానికి రంగంలోకి దిగారు. హిందీలో ప్రముఖ రచయితలను బృందంగా చేసి బాహుబలి 3 కి స్టోరీ రెడీ చేయమని పురమాయించినట్లు బాలీవూడ్ వర్గాలు వెల్లడించాయి. ఆ స్టోరీ విజయేంద్ర ప్రసాద్, రాజమౌళి కి నచ్చే విధంగా ఉండాలని కండిషన్ కూడా పెట్టారంట. ఇలా కరణ్ జోహార్ ఉత్సాహం చూస్తుంటే త్వరలో బాహుబలి 3 తీస్తున్నట్లు అధికారిక ప్రకటన వచ్చేలా ఉంది. ఆ మాట కోసం దేశవ్యాప్తంగా బాహుబలి అభిమానులు ఎదురుచూస్తున్నారు. వారి కోరిక ఫలించుకాక.


Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus