శ్రావణ భార్గవి అన్నమయ్య కీర్తనల వీడియో రోజు రోజుకు వివాదంగా మారుతుంది. ఈమె అన్నమయ్య కీర్తనలను పాడుతూ ఒక వీడియో చేసి ఆ వీడియోని తన యూట్యూబ్ ఛానల్ ద్వారా షేర్ చేశారు. ఈ వీడియోలో భాగంగా ఆమె వివిధ భంగిమలలో పడుకొని కాళ్లు పైకి లేపి ఊపడమే కాకుండా జంతికలు తింటూ ఎంతో శృంగార భరితంగా నటించిందని ఈ వీడియో పై పలువురు అభ్యంతరం వ్యక్తం చేశారు.ఈ క్రమంలోనే శ్రావణ భార్గవి చేసిన ఈ వీడియో పై ఏకంగా అన్నమయ్య వంశస్థులు కూడా స్పందించి
ఆమె ఈ వీడియోని డిలీట్ చేయాలని లేకపోతే తనపై న్యాయపరమైన చర్యలు తీసుకోవడానికి కూడా వెనకాడమంటూ తనకు వార్నింగ్ ఇచ్చారు.ఇకపోతే ఈ విషయంపై శ్రావణ భార్గవి స్పందిస్తూ తాను ఎలాంటి తప్పు చేయలేదని తాను ఈ వీడియో ఏ మాత్రం డిలీట్ చేయనని ఖరాఖండిగా చెప్పేశారు. ఒకవేళ తను ఈ పాట విషయంలో ఏదైనా తప్పు చేసి ఉంటే ఆ అమ్మవారి తనని శిక్షిస్తారని తానే తన చేత ఈ వీడియో డిలీట్ చేయిస్తారంటూ శ్రావణ భార్గవి తన తప్పు లేదన్నట్టు సమర్పించుకుంది.
ఇకపోతే శ్రావణ భార్గవి ఈ వివాదంలోకి కరాటే కళ్యాణి ఎంట్రీ ఇచ్చారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ హిందూ ధర్మ శాస్త్రం ప్రకారం పెళ్లి అయిన మహిళ నుదుటిన బొట్టు మెడలో తాళి కాలికి మెట్టెలు పెట్టుకోవాలి ఇవేవీ శ్రావణ భార్గవి పెట్టుకోలేదు. ఇవన్నీ ఎందుకు పెట్టుకోలేదు నాకు అర్థం కాలేదు ఇవన్నీ లేకుండానే కాళ్లు ఊపుతూ అన్నమయ్య కీర్తనలు పాడుతానంటే కుదురుతుందా అంటూ ఈమె ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఒకప్పుడు కె విశ్వనాథ్ గారు రాఘవేంద్ర రావు గారు ఇలాంటి సినిమాలు చేశారు కదా అంటే అప్పుడు ప్రశ్నించేవారు లేరు ఇప్పుడు ప్రశ్నించే వాళ్ళు ఉన్నారు కనుక ఈ వీడియోని తాను డిలీట్ చేయాలని ఒకవేళ డిలీట్ చేయకపోయినా కొన్ని కొన్ని సన్నివేశాలను తొలగించాలని లేకపోతే భవిష్యత్తులో తాను బాధపడాల్సి వస్తుందని కరాటే కళ్యాణి ఈ సందర్భంగా శ్రావణ భార్గవి వివాదంపై స్పందించారు.