Karate Kalyani : కరాటే కళ్యాణి షాకింగ్ కామెంట్స్ వైరల్..!

టాలీవుడ్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఓ వెలుగు వెలిగింది కరాటే కళ్యాణి. ఈమె ఎక్కువ సినిమాల్లో వ్యాంప్ రోల్స్ చేసింది. అయితే ఈమె కామెడీ కూడా అద్భుతంగా పండించగలదు.దాదాపు 25 సినిమాల్లో నటించిన ఈమె.. ‘కృష్ణ’ ‘మిరపకాయ్’ వంటి సినిమాల్లో తన నటనతో ప్రేక్షకులను అలరించింది. ఈమె కెరీర్ లో ఈమెకు గుర్తింపు తెచ్చిన పాత్రలు అంటే ఇవే అని చెప్పాలి. ‘కృష్ణ’ మూవీలో బాబీ.. అంటూ వింత మేనరిజం లో పలకడం అలాగే ‘మిరపకాయ్’ లో ‘అబ్బ…. పిండేశారు’ అంటూ అనడం ఈమెను బాగా పాపులర్ చేశాయని చెప్పాలి.

ఇదిలా ఉండగా.. ఈమెకు సినిమాల్లో అవకాశాలు తగ్గాయి అనుకున్న టైంలో ‘బిగ్ బాస్ 4’ లోకి ఎంట్రీ ఇచ్చి వార్తల్లో నిలిచింది. ఆ షోలో ఈమె లైఫ్ లో ఎంత ట్రాజెడీ ఉందో తెలియజేసింది. అటు తర్వాత ‘మా’ ఎలక్షన్స్ టైంలో కూడా ఈమె ఎక్కువగా వార్తల్లో నిలిచింది. ఇదిలా ఉండగా.. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఈమె తనకు పాపులారిటీ తెచ్చిపెట్టిన పాత్రల వల్ల తన పై వ్యభిచారిణి అనే ముద్ర పడింది అంటూ షాకింగ్ కామెంట్లు చేసింది.

ఆమె మాట్లాడుతూ.. “బతుకుతెరువు కోసం నేను సినిమాల్లో నటిస్తున్నాను. అందుకే వచ్చిన ప్రతి అవకాశాన్ని అందిపుచ్చుకుంటున్నాను. ఎక్కువ మంది నన్ను బాబీ డైలాగ్ తోనే గుర్తుపడుతున్నారు. కానీ నాలో మరో కోణం కూడా ఉంది. నిజజీవితంలో నేను చాలా మందికి సాయం చేశాను. వారంతా నన్ను చాలా గౌరవిస్తారు. ఇక నేను సింగింగ్‌, హరికథ, డ్యాన్స్‌, యాంకరింగ్‌, జింగిల్స్‌ పాడటం వంటివి అన్ని చేశాను. ఇండస్ట్రీలోకి వచ్చాక..

బతకడం కోసం.. డబ్బింగ్‌ చెప్పడం.. జింగిల్స్‌ పాడటం చేశాను. నేను సినిమాల్లో పోషించిన కొన్ని పాత్రలు.. ముఖ్యంగా నాకు గుర్తింపు తెచ్చిపెట్టిన పాత్రల కారణంగా నన్ను వ్యభిచారిణి అన్నట్టు చూస్తున్నారు. నా గురించి అలాగే కామెంట్లు చేస్తున్నారు. ఇది నన్ను చాలా బాధిస్తుంది” అంటూ చెప్పుకొచ్చింది కరాటే కళ్యాణి.

18 పేజెస్ సినిమా రివ్యూ& రేటింగ్!
ధమకా సినిమా రివ్యూ& రేటింగ్!

ఈ ఏడాది ఓవర్సీస్ లో 1 మిలియన్ కొట్టిన సినిమాల లిస్ట్..!
టాప్ 10లో తెలుగు ఇండస్ట్రీ నుండి ఎన్ని సినిమాలు ఉన్నాయంటే..?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus