మంగళవారం పండంటి బిడ్డకు జన్మనిచ్చిన కరీనా కపూర్
- December 20, 2016 / 08:38 AM ISTByFilmy Focus
బాలీవుడ్ హీరోయిన్ కరీనాకపూర్ మంగళవారం పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. తల్లీ బిడ్డలు క్షేమంగా ఉన్నారు. ఈ సంతోష వార్తను కరీనా, సైఫ్ అలీఖాన్ దంపతులు తమ అభిమానులతో పంచుకున్నారు. వీరిద్దరూ 2008 నుంచి కలిసి సినిమాల్లో నటించారు. అప్పటి నుంచి ఇద్దరూ డేటింగ్ చేశారు. అప్పటికే సైఫ్ కి అమృతాసింగ్ తో పెళ్లి అయి సారా అనే కూతురు, ఇబ్రహీం అనే కొడుకు ఉన్నారు. అయినా ప్రేమలో పడిన సైఫ్ మొదటి భార్యకు విడాకులు ఇచ్చి కరీనాను 2012 లో పెళ్లి చేసుకున్నారు.
వీరి జీవితంలోకి మరో వ్యక్తి రాబోతున్న వార్తను ఈ సంవత్సరం మొదట్లో వెల్లడించారు. తొమ్మిది నెలల కడుపుతో ఉన్న కరీనాకి నొప్పులు రావడంతో సోమవారం ముంబైలోని బ్రీచ్ క్యాండీ ఆస్పత్రిలో ఆమెను కుటుంబ సభ్యులు జాయిన్ చేశారు. ఆమె నేడు (మంగళవారం) ఉదయం 7.30 గంటలకు మగ బిడ్డకు జన్మనిచ్చింది. బాబు పుట్టిన విషయంతో పాటు, అతనికి తైమూర్ అలీఖాన్ పటౌడీ అని పేరు కూడా పెట్టినట్లు కరీనా, సైఫ్ దంపతులు ఓ ప్రకటన ద్వారా వెల్లడించారు. దీంతో బాలీవుడ్ ప్రముఖులు వారికీ శుభాకాంక్షలు తెలియ జేశారు.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.














