Kareena Kapoor: కరీనా కొత్త సినిమాకు హైదరాబాద్‌ లింక్‌.. ఏం చూపిస్తారో?

స్టార్‌ హీరోయిన్‌ ఓ వెలుగు వెలుగుతున్నప్పుడు పూర్తి స్థాయి గ్లామర్‌ రోల్స్‌ చేస్తూనే అప్పుడప్పుడు ప్రయోగాలు చేసిన కథానాయిక కరీనా కపూర్ (Kareena Kapoor). ఇప్పుడు సెకండ్‌ ఇన్నింగ్స్‌లో మాత్రం పూర్తి స్థాయిలో ప్రయోగాలు, హీరోయిన్‌ ఓరియెంటెడ్‌ సినిమాలు, నాయికా ప్రధాన చిత్రాలకే ఓటేస్తోంది. అలా కొన్ని నెలల క్రితం ‘క్రూ’ సినిమాతో అలరించిన కరీనా కపూర్‌ ఇప్పుడు మరోసారి లాంటి కథనే ఎంచుకుంది అని అంటున్నారు. 25ఏళ్లుగా సినీ రంగంలో రాణిస్తూ, స్టిల్‌ స్టార్‌ హీరోయిన్‌ హోదాలోనే ఉన్న కరీనా కపూర్‌..

వాస్తవ సంఘటనల ఆధారంగా రానున్న ఓ సినిమాలో ప్రధాన పాత్ర పోషించనున్నట్లు తెలిసింది. ఈ సినిమా కథ మనకు బాగా దగ్గరైంది అని అంటున్నారు. హైదరాబాద్‌లో జరిగిన ఓ హత్యాచార కేసు నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కనుందట. అయితే ఎవరి హత్యాచార కేసు అనే వివరాలు పూర్తిగా వెల్లడించడం లేదు. ఈ సినిమాను ‘ఛపాక్‌’, ‘రాజీ’ సినిమాల దర్శకురాలు మేఘనా గుల్జర్‌ తెరకెక్కిస్తారట. ఇక ఇదే సినిమాలో మరో కీలక పాత్రలో బాలీవుడ్‌ స్టార్‌ హీరో ఆయుష్మాన్‌ ఖురానా (Ayushmann Khurrana) నటిస్తాడట.

సినిమా చిత్రీకరణను ఈ ఏడాది చివరిలో ప్రారంభిస్తారని సమాచారం. అప్పుడు ఆ హత్యాచార కథ ఎవరికి సంబంధించినది అని ఏమన్నా తెలుస్తుందేమో చూడాలి. అన్నట్లు ఇలాంటి కథలను హ్యాండిల్‌ చేయడంలో మేఘనా గుల్జార్‌ సిద్ధహస్తురాలు. కాబట్టి ఓ డిఫరెంట్‌ సినిమాను చూస్తామనే నమ్మకం గట్టి ఉంది. మరోవైపు కరీనా ‘సింగమ్‌ అగైన్‌’ సినిమాలోనూ నటిస్తోంది.

అందులో అజయ్‌ దేవగణ్‌ (Ajay Devgn) భార్య అవ్నీ కామత్‌ అనే పాత్రలో కనిపించనుంది. ఇక కరీనా సౌత్‌ సినిమాల్లో నటిస్తోంది అంటూ గత కొన్ని నెలలుగా చాలా సినిమా పేర్లు వినిపిస్తూ వస్తున్నాయి. అయితే ఎక్కడా ఆమె ఓకే చేయలేదు. యశ్‌ (Yash) ‘టాక్సిక్‌’లో (Toxic) కీలక పాత్ర కోసం కరీనాను సంప్రదించారు అని టాక్‌ వచ్చింది. అయితే ఆమె బదులు నయనతారను (Nayanthara) తీసుకున్నారనే చర్చ కూడా సాగింది.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus