బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కరీనా కపూర్ ఖాన్, సైఫ్ అలీ ఖాన్ జంట తరచూ వివాదాలతో వార్తల్లో నిలుస్తుంటుంది. పెళ్లి చేసుకున్న దగ్గర నుంచి పిల్లల వరకు ఈ దంపతులు తీసుకున్న పలు నిర్ణయాలు వివాదాలకు కేంద్రబిందువుగా మారాయి. తాజాగా ఈ జంటకి పుట్టిన రెండో సంతానానికి సంబంధించి కూడా నెటిజన్లు విపరీతంగా ట్రోల్ చేశారు. దీంతో పిల్లలకు పేర్లు పెట్టే హక్కు తల్లితండ్రులకు మాత్రమే ఉంటుందని కరీనా సోషల్ మీడియా మీడియా వేదికగా మండిపడింది.
ఈ జంటకు 2016లో ఓ కుమారుడు జన్మించగా.. ఈ ఏడాది ఫిబ్రవరిలో మరో కుమారుడు పుట్టాడు. అయితే మొదటి బిడ్డకు తైమూర్ అలీఖాన్ అని పేరు పెట్టగా.. అప్పట్లో అదొక పెద్ద ఇష్యూ అయింది. 1398లో భారతదేశంపై దండెత్తిన పర్షియన్ చక్రవర్తి తైమూర్ ను గుర్తుచేసేలా పేరుందని.. నెటిజన్లు అప్పట్లో విమర్శలు చేశారు. ఇక రెండో కుమారుడుకి జహంగీర్ అలీఖాన్ అని పేరు పెట్టారు. ఆ పేరు కూడా నెటిజన్ల ఆగ్రహానికి కారణమైంది.
దీంతో సోషల్ మీడియాలో దారుణంగా ట్రోల్ చేశారు. దీనిపై స్పందిస్తూ కరీనా ఇన్స్టాగ్రామ్ లో ఓ పోస్ట్ పెట్టింది. పిల్లలను కనిపించే తల్లితండ్రులకు మాత్రమే వారి జీవితం గురించి నిర్ణయం తీసుకునే హక్కు ఉందని.. మరెవరికీ ఉండదని చెప్పింది. ఇతర కుటుంబ సభ్యులకి కూడా లేదని.. అందరూ దీన్ని గుర్తుంచుకోవాలని రాసుకొచ్చింది. రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో కూడా కరీనా ఈ విషయం గురించి మాట్లాడింది. తమకు నచ్చిన పేర్లు.. బాగుంటాయని పిల్లలకు పెడతామని.. మరో ఉద్దేశం లేదని చెప్పింది. పిల్లలను ఇంత భయంకరంగా ఎలా ట్రోల్ చేస్తారని ఆవేదన వ్యక్తం చేసింది.
Most Recommended Video
టక్ జగదీష్ సినిమా రివ్యూ & రేటింగ్!
సీటీమార్ సినిమా రివ్యూ & రేటింగ్!
తలైవి సినిమా రివ్యూ & రేటింగ్!