Kareena Kapoor: హీరోలే కాదు మేమూ చేయగలం.. స్టార్‌ హీరోయిన్‌ షాకింగ్‌ కామెంట్స్‌!

హీరోలకు మేమేం తక్కువ… వాళ్లతో సమానంగా వేతనాలు ఎందుకు ఇవ్వరు. మా హీరోయిన్లలో హీరోలతో పోటీ పడి యాక్షన్‌ సీన్స్‌ చేసేవాళ్లూ ఉన్నారు అంటూ కథానాయికలు గత కొన్ని దశాబ్దలుగా అంటూనే ఉన్నారు. మనం వింటూనే ఉన్నాం. అయితే ఈ చర్చలో ఇప్పటికీ ఎలాంటి మార్పు లేదు. అయితే ఇప్పుడు ఇదే రకం చర్చకు దారి తీస్తున్నాయి ప్రముఖ బాలీవుడ్‌ సీనియర్‌ కథానాయిక కరీనా కపూర్‌ (Kareena Kapoor Khan) మాటలు. అలా అని అవి షాకింగ్‌ కామెంట్స్‌ ఏమీ కావు.

బాలీవుడ్‌లో ప్రతిభ ఉన్న కథానాయికల్లో కరీనా కపూర్‌ ఒకరు. ప్రేమకథా చిత్రాలు, యాక్షన్‌, సస్పెన్స్‌ థ్రిల్లర్‌ అంటూ అన్ని రకాల జోనర్‌లో సినిమలు చేసి మెప్పిస్తుంటారామమె. తాజాగా ఆమె నటించిన ‘క్రూ’ అనే సినిమా విడుదలైంది. ఈ క్రమంలో ఆమె మీడియాతో మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అలాగే తన కెరీర్‌ గురించి, హీరోయిన్ల గురించి ఆమె మాట్లాడారు. అందులో ఒక సందర్భంగా హీరోలే కాదు మేం కూడా చేయగలం అని అంది.

25 ఏళ్ల సినీ ప్రయాణంలో ఎన్నో అపజయాల్ని చూశానని, ఎన్నో విమర్శల్ని ఎదుర్కొన్నానని, ‘జబ్‌ వీ మెట్‌’ సినిమా విడుదలయ్యే వరకూ ఫ్లాపులే ఎక్కువ వచ్చాయని కరీనా తన తొలి రోజులు గుర్తు చేసుకుంది. సరైన విజయాలు లేని కారణంగగానే ఏడాది పాటు సినిమాలకు దూరంగా ఉన్నానని నాటి బాధను చెప్పుకొచ్చింది. సినిమాల గురించి, తన కెరీర్‌ గురించి ఆలోచిస్తూ, ఏడుస్తూ ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపానని చెప్పింది కరీనా.

‘క్రూ’ సినిమాకు వస్తున్న స్పందన తనకు ఎంతో ఆనందాన్నిస్తోందని చెప్పి కరీనా… టబు(Tabu), కృతితో (Kriti Sanon) కలసి చేసిన హంగామా గుర్తు చేసుకుంటూ నవ్వుకుంది. ఎప్పుడు కథానాయకులే కాదు, కథానాయికలు కూడా కామెడీ పండించగలరని ఈ సినిమాతో మేం చెప్పాం అంటూ గర్వంగా ఫీల్‌ అయ్యింది కరీనా కపూర్‌. మార్చి 29న విడుదలైన ఈ సినిమా బాక్సాఫీసు దగ్గర మంచి విజయమే అందుకుంది.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus