స్వర్గీయ నందమూరి తారక రామారావు నట వారసులు బాలకృష్ణ, హరికృష్ణల తర్వాత యంగ్ టైగర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ (బాలనటులు) తర్వాత ఆ వంశం నుండి మూడోతరం మూడో నటవారసుడిగా ‘ఒకటో నెంబర్ కుర్రాడు’ మూవీతో ఎంట్రీ ఇచ్చాడు నందమూరి తారకరత్న.. ఒకేరోజు ఏకంగా 9 సినిమాలు ప్రారంభించి అప్పట్లో సెన్సేషన్ క్రియేట్ చేశాడు.. తర్వాత ప్రతినాయకుడిగా మారి ‘అమరావతి’ సినిమాకు గానూ నంది అవార్డునందుకుని.. నారా రోహిత్ ‘రాజా చెయ్యివేస్తే’ లోనూ విలన్‌గా ఆకట్టుకున్నాడు. ఇటీవల తారకరత్న గుండెపోటుకి గురై.. బెంగుళూరులోని నారాయణ హృదయాలయ హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే.
బాబాయ్ బాలయ్య దగ్గరుండి అన్ని ఏర్పాట్లు చూసుకుంటున్నారు. ఆయనతో పాటు తారకరత్న భార్య, కుమార్తె కూడా ఆక్కడే ఉన్నారు. భవిష్యత్ రాజకీయాల్లో చురుగ్గా పాల్గొనాలని, పార్టీ తరపున ప్రచారం చేయాలని ప్రణాళిక వేసుకుంటున్న తరుణంలో ఇలా జరగడంతో అంతా షాక్ అయ్యారు. నందమూరి అభిమానులు, పార్టీ వర్గాల వారు ఆయన త్వరగా కోలుకుని, పూర్తి ఆరోగ్యంతో రావాలని పూజలు, ప్రార్థనలు చేస్తున్నారు. నారా చంద్రబాబు నాయుడుతో సహా.. ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ దంపతులు, దగ్గుబాటి పురందేశ్వరి, నందమూరి సుహాసిని, బాలయ్యకి ఆప్తుడు, కన్నడ స్టార్ శివ రాజ్ కుమార్,
తెలుగుదేశం పార్టీ నాయకులు పలువురు ఆసుపత్రిలో తారకరత్నను పరామర్శించారు. ప్రస్తుతం ఆయన వైద్యానికి స్పందిస్తున్నారని తెలుస్తోంది. అయితే తారకరత్న ఆరోగ్యం కోలుకోవడానికి బాలయ్య, చంద్రబాబులతో పాటు తెరవెనుక మరో ప్రముఖ వ్యక్తి కూాడా ఉన్నారు.. ఆయనే కర్ణాటక ఆరోగ్య శాఖామంత్రి కేశవ సుధాకర్. చంద్రబాబు, కర్ణాటక సీఎంని గ్రీన్ ఛానెల్ ఏర్పాటు చేయాలని కోరినప్పటినుండి.. ప్రతీ విషయం దగ్గరుండి చూసుకున్నారు సుధాకర్. దీని కోసం అధికారిక కార్యక్రమాలను సైతం రద్దు చేసుకున్నారాయన.
తారకరత్నను బెంగుళూరు తరలించింది మొదలుకుని, ప్రతిక్షణం వైద్యులతో మాట్లాడుతూ. పర్సనల్‌గా తీసుకుని ఏది కావాలంటే అది సిద్ధం చేయించారు. ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్, శివ రాజ్ కుమార్‌లతో పాటు హాస్పిటల్‌కి వెళ్లారు. వీళ్లను రిసీవ్ చేసుకోవడానికి సుధాకర్ స్వయంగా ఎయిర్ పోర్టుకెళ్లారు. తారకరత్న కోలుకోవడం వెనుక ఇంత శ్రమించిన ఆరోగ్య శాఖామంత్రిని నందమూరి కుటుం సభ్యులు, అభిమానులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు అభినందిస్తున్నారు. అభిమానులైతే.. ‘మీకు రుణపడి ఉంటాం మంత్రి గారూ’ అంటూ పోస్టులు చేస్తూ కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు..
ಬೆಂಗಳೂರಿನ ನಾರಾಯಣ ಹೃದಯಾಲಯಕ್ಕೆ ತೆಲುಗು ಚಿತ್ರರಂಗದ ಖ್ಯಾತ ನಟರಾದ ಶ್ರೀ @tarak9999 ಅವರೊಂದಿಗೆ ಭೇಟಿ ನೀಡಿ ಅವರ ಸಹೋದರ ಸಂಬಂಧಿ ಖ್ಯಾತ ನಟರಾದ ಶ್ರೀ ನಂದಮೂರಿ ತಾರಕ ರತ್ನ ಅವರ ಆರೋಗ್ಯದ ಸ್ಥಿತಿಯ ಬಗ್ಗೆ ವೈದ್ಯರಿಂದ ಮಾಹಿತಿ ಪಡೆಯಲಾಯಿತು.
ಬೆಂಗಳೂರಿನಲ್ಲಿ ಚಿಕಿತ್ಸೆ ಪಡೆಯುತ್ತಿರುವ ಖ್ಯಾತ ನಟರಾದ ಶ್ರೀ ನಂದಮೂರಿ ತಾರಕ ರತ್ನ ಅವರನ್ನು ಕಾಣಲು ಕುಟುಂಬ ಸಮೇತ ಆಗಮಿಸಿರುವ ಅವರ ಸಹೋದರ ಸಂಬಂಧಿ ಖ್ಯಾತ ನಟರಾದ ಶ್ರೀ @tarak9999 ಅವರನ್ನು ಬೆಂಗಳೂರಿನಲ್ಲಿ ಬರಮಾಡಿಕೊಳ್ಳಲಾಯಿತು.
ಶ್ರೀ ನಂದಮೂರಿ ತಾರಕ ರತ್ನ ಅವರು ಶೀಘ್ರ ಗುಣಮುಖರಾಗಲೆಂದು ಆ ಭಗವಂತನಲ್ಲಿ ಪ್ರಾರ್ಥಿಸುತ್ತೇನೆ. pic.twitter.com/mQJQjkF3Dz
తారకరత్న ప్రాణాలు కాపాడటానికి మనం ఎంత సేపు బాలయ్య, చంద్రబాబు గార్ల గురించే మాట్లాడుతున్నాం.
చాలా మందికి తెలియని వ్యక్తి కర్ణాటక ఆరోగ్య శాఖా మంత్రి కేశవ సుధాకర్ గారు
చంద్రబాబు కర్ణాటక సీఎంతో మాట్లాడి బెంగళూరులో గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేయించాలని అడిగినప్పటి నుంచి మొదల. pic.twitter.com/xBQmUbI0xd