Karthi: ‘దేవర’తో పోటీ.. కార్తి రియాక్షన్‌ ఏంటో తెలుసా?

మొన్నీమధ్యే మాట్లాడుకున్నాం గుర్తుందా? ‘దేవర’ (Devara) సినిమాతో పోటీ పడటానికి తెలుగులో ఎవరూ ముందుకు రావడం లేదు. పెద్ద సినిమా కాబట్టి.. మొత్తం అభిమానులు, ప్రేక్షకులు అటే వెళ్తారేమో అనే డౌట్‌తోనే ఎవరూ ముందుకు రావడం లేదు అని చెప్పాలి. ఎందుకంటే ఆరేళ్ల తర్వాత తారక్‌ నుండి సోలోగా వస్తున్న సినిమా కాబట్టి. అయితే ఇలాంటి సమయంలో ఓ సినిమా పోటీకి ముందుకొచ్చింది. ఈ పోటీ గురించి ఆ హీరోను అడిగితే ఆసక్తికర సమాధానం వచ్చింది.

Karthi

ఆ సినిమానే ‘సత్యం సుందరం’ (Sathyam Sundaram)  . కార్తి (Karthi)  (Karthi) – అరవింద్‌ స్వామి (Arvind Swamy) కాంబినేషన్‌లో రూపొందిన ఈ సినిమాను తెలుగులో ఆ పేరుతో విడుదల చేస్తున్నారు. నిజానికి ఈ సినిమాను సెప్టెంబరు 27న విడుదల చేస్తామని తొలుత చెప్పారు. అయితే ఇప్పుడు దానిని సెప్టెంబరు 28న రిలీజ్‌ చేస్తున్నారు. ఆ లెక్కన రెండు సినిమాల మధ్య పోటీ ఏర్పడింది. ‘సత్యం సుందరం’ సినిమా ప్రచారంలో భాగంగా హైదరాబాద్ వచ్చిన కార్తి దగ్గర ఇదే విషయాన్ని ప్రస్తావిస్తే ఆసక్తికర కామెంట్‌ చేశాడు.

దీంతో ఆ మాటలు ఇప్పుడు వైరల్‌గా మారాయి. తారక్‌ (Jr NTR)  సినిమాకు, మా సినిమాకు పోలికే లేదు. ‘దేవర’ ఓ వార్ లాంటి సినిమా. మా ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ లాంటి సినిమా అని జోనర్‌తో కొట్టాడు. ఆ లెక్కన రెండింటి మధ్య, ఇద్దరి మధ్య పోటీయే లేదని తేల్చేశాడు. ఇక ఈ సినిమా సంగతి చూస్తే.. కార్తి గత సినిమాలతో పోల్చుకుంటే ‘సత్యం సుందరం’ సినిమాకు ప్రమోషన్స్ బాగా తక్కువగా ఉన్నాయి.

కథ విషయానికి వస్తే అన్ కండీషనల్ లవ్ అనే అంశం చుట్టూ తిరిగే కథ ఇది. ‘96’ సినిమా ఫేమ్‌ ప్రేమ్ కుమార్ (C. Prem Kumar)  ఈ సినిమా తెరకెక్కించారు. ‘96’ లాగే ఇది కూడా ఒక్క రాత్రిలో జరిగే కథ అట. మరి ఈసారి ప్రేమ్‌ కుమార్‌ ఎంతలా మెప్పిస్తారో చూడాలి. ఎందుకంటే ‘96’ సినిమా కల్ట్‌ క్లాసిక్‌ మరి.

 సుహాస్ మునుపటి సినిమాకంటే ఎక్కువ కలెక్షన్స్ సాధిస్తోందట!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus