Gorre Puranam: సుహాస్ మునుపటి సినిమాకంటే ఎక్కువ కలెక్షన్స్ సాధిస్తోందట!

సుహాస్ (Suhas) కథానాయకుడిగా బాబీ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన తాజా చిత్రం “గొర్రె పురాణం” (Gorre Puranam). శనివారం (సెప్టెంబర్ 21) విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకుల్ని ఆశ్చర్యపరుస్తూ అలరిస్తోంది. ప్రయోగాత్మక కథనంతో తెరకెక్కిన ఈ చిత్రం సమాజం, మీడియా మరియు ప్రభుత్వం మీద ఓ వ్యంగ్యాస్త్రంలా సంధించబడింది. ముఖ్యంగా గొర్రెను మెయిన్ క్యారెక్టర్ లా ఎస్టాబ్లిష్ చేసిన విధానం.. ప్రస్తుతం కొన్ని న్యూస్ ఛానల్స్ సమాజంలో జరుగుతున్న వార్తలను ఎలా ప్రాజెక్ట్ చేస్తున్నాయి?

Gorre Puranam

వాటిని జనం ఎలా రిసీవ్ చేసుకుంటున్నారు? వంటి విషయాలను వ్యంగ్యంగా వివరించిన విధానం ఆకట్టుకుంటోంది. ఓ ప్రయోగంగా రూపొందిన ఈ చిత్రం కలెక్షన్స్ కూడా మెల్లమెల్లగా పుంజుకుంటున్నాయి. సుహాస్ మునుపటి చిత్రాలైన “శ్రీరంగనీతులు (Sriranga Neethulu)  , ప్రసన్న వదనం”  (Prasanna Vadanam)   కంటే బెటర్ కలెక్షన్స్ “గొర్రె పురాణం” సాధిస్తుండడం గమనార్హం. ఎందుకంటే.. సుహాస్ ఆ సినిమాలను ప్రమోట్ చేసిన విధానం వేరు.

“గొర్రె పురాణం” (Gorre Puranam) సినిమాను ఎందుకో సుహాస్ కనీస స్థాయిలో కూడా ప్రమోట్ చేయలేదు. అయినా నిర్మాతలు వెనుకడుగు వేయకుండా సెప్టెంబర్ 21న విడుదల చేశారు. నిర్మాతలు తీసుకున్న రిస్క్ కు ప్రేక్షకుల ప్రశంసలు, కలెక్షన్స్ మంచి సంతృప్తినిచ్చాయి. ఎలాగు “దేవర” వచ్చే వరకు పోటీ మీ లేదు కాబట్టి. “గొర్రె పురాణం” ప్రాఫిట్ జోన్ లోకి వచ్చేయడం ఖాయం.

త్రివిక్రమ్, వెంకీ కుడుముల వర్కౌట్ కాలేదు.. ఇప్పుడు హరీష్ శంకర్ కూడా..?!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus