మొత్తానికి ప్రేమి విశ్వనాథ్ క్లారిటీ ఇచ్చేసింది..!

తెలుగు సీరియల్ స్థాయిని అమాంతం పెంచేసింది ‘కార్తీక దీపం’. ఈ సీరియల్ కు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ అంతా ఇంతా కాదు. ఒకానొక టైములో ఇండియన్ సీరియల్స్ లోనే అత్యథిక టి.ఆర్.పి రేటింగ్ ను నమోదు చేసిన సీరియల్ గా రికార్డులు క్రియేట్ చేసింది. ఈ సీరియల్ ద్వారా ఫేమస్ అయ్యింది ప్రేమి విశ్వనాథ్. నిజానికి ఈమె మలయాళ నటి అయినప్పటికీ తెలుగు అమ్మాయి లాగానే కనిపిస్తుంది.అందుకేనేమో ఈమెకు తెలుగులో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడింది. ‘కార్తీక దీపం’ సీరియల్ లో ఈమె ‘వంటలక్క’ అలియాస్ దీప పాత్ర పోషిస్తుంది.

ఐదవ విడత లాక్ డౌన్ లో షూటింగ్ లకు పర్మిషన్ ఇవ్వడంతో.. ఈ సీరియల్ మొదటి షెడ్యూల్ ను నిర్వహించారు. అది పూర్తయిన వెంటనే తిరిగి.. ఈమె సొంత ఊరు అయిన కేరళ లోని కొచ్చికి వెళ్ళిపోయింది. అయితే ‘ఈమెకు కరోనా సోకింది. అందుకే షూటింగ్ కు బ్రేక్ ఇచ్చి వెళ్ళిపోయింది’ అంటూ ప్రచారం మొదలైంది. ఈ ప్రచారం పై స్వయంగా ప్రేమి విశ్వనాథే క్లారిటీ ఇచ్చింది. ఆమె మాట్లాడుతూ.. ” అందరికీ నమస్కారం.. అందరూ బాగున్నారా? నేను బాగున్నాను.. ఇంట్లోనే ఉన్నాను..మా సొంత ఊరు అయిన కేరళాలోనే ఉన్నాను. అందరూ వీడియో చూస్తున్నారు కదా…!ఇప్పుడు నేను సేఫ్‌గా కేరళలో ఉన్నాను.ఇటీవల నేను కొన్ని న్యూస్ లు‌ విన్నాను. చూశాను.! ఏంటంటే.. నాకు కరోనా పాజిటివ్ వచ్చిందని… ఫేక్ న్యూస్.. రూమర్స్ క్రియేట్ చేస్తున్నారు.

అవేవీ నిజం కాదు. నేను సేఫ్‌గా ఇంట్లోనే ఉన్నాను. హ్యాపీగా హెల్దీగానే షూటింగ్‌కి వెళ్లాను. అదే హ్యాపీనెస్‌తో అంతే హెల్దీగా నేను తిరిగి వచ్చాను. సో ఇలాంటి ఫేక్ న్యూస్ అస్సలు నమ్మకండి. అలాంటిదేమైనా ఉంటే నేనే లైవ్‌లోకి వచ్చి చెప్తాను. డైలీ అప్‌డేట్ ఇస్తాను.ఇంకా ఇలాంటి ఫేక్ న్యూస్ క్రియేట్ చేసిన వాళ్లతో నేనేం చెప్పాలనుకుంటున్నానంటే.. నా అభిమానులతో నా ప్రేక్షకులతో, నా స్నేహితులతో నేను డైలీ టచ్‌లో ఉన్న విషయం మీరు మరిచిపోకండి..! ఇలా ఫేక్ న్యూస్ అనేవి క్రియేట్ చెయ్యడం ఆపేసి.. మంచి న్యూస్, నిజమైన న్యూస్ చెయ్యడానికి మీరు ట్రై చెయ్యండి” అంటూ ప్రేమి విశ్వనాథ్ చెప్పుకొచ్చింది.

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

21

22

23

24

25

26

27

28

29

30

31

32

33

34

35

36

37

38

39

40

15 డైరెక్టర్స్ కెరీర్ ను ఇబ్బందిలో పడేసిన సినిమాలు ఇవే!
కులాంతర వివాహాలు చేసుకొని ఆదర్శంగా నిలిచిన మన హీరోలు!
హీరోయిన్స్ కంటే ముందు బాలనటిగా అలరించిన తారల!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus