Karthikeya 2 Review: కార్తికేయ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

  • August 13, 2022 / 02:00 PM IST

2014లో విడుదలై.. మంచి విజయం సొంతం చేసుకున్న “కార్తికేయ” చిత్రానికి సీక్వెల్ గా తెరకెక్కిన చిత్రం “కార్తికేయ 2”. నిఖిల్-చందు మొండేటిల కాంబినేషన్ లో తెరకెక్కిన ఈ మిస్టరీ థ్రిల్లర్ పై మంచి అంచనాలున్నాయి. మరి సినిమా ఆ అంచనాలను అందుకోగలిగిందో లేదో చూద్దాం..!!

కథ: డాక్టర్ కార్తీక్ కుమారస్వామి (నిఖిల్ సిద్ధార్ధ్) తల్లి కోరిక మేరకు మొక్కు తీర్చుకోవడం కోసం ద్వారక వస్తాడు. అక్కడ కార్తీక్ కు పరిచయమవుతుంది ముగ్ధ (అనుపమ పరమేశ్వరన్). అక్కడి నుండి కార్తీక్ ప్రయాణం కృష్ణుడి కంకణం కోసం మొదలవుతుంది.  అసలు కార్తీక్ కి కృష్ణుడి కంకణానికి సంబంధం ఏమిటి? కృష్ణుడి భక్తులు, ఆయన్ని పూజించే దొంగలు, కార్తీక్ ల నడుమ సాగిన ప్రయాణమే “కార్తికేయ 2” కథాంశం.

నటీనటుల పనితీరు: నిఖిల్ సిద్ధార్ధ్ నటించిన సినిమా విడుదలై మూడేళ్లవుతోంది. ఇన్నాళ్ల గ్యాప్ తర్వాత నిఖిల్ ను మళ్ళీ ఓ ఫుల్ లెంగ్త్ ఎంటర్టైనింగ్ రోల్లో చూడడం ఆసక్తికరంగా ఉంది. కార్తికేయ రోల్ ను నిఖిల్ క్యారీ చేసిన విధానం, డైలాగ్ డెలివరీ ఆడియన్స్ ను ఆకట్టుకుంటాయి. అనుపమ రెగ్యులర్ హీరోయిన్ రోల్లో కాకుండా.. ఒక డిఫరెంట్ క్యారెక్టర్ తో అలరించింది.

శ్రీనివాసరెడ్డి, హర్ష చెముడు, ప్రవీణ్ ల కామెడీ ఆడియన్స్ ను కడుపుబ్బ నవ్విస్తుంది.  కామెడీ కోసం సపరేట్ ట్రాక్ లా కాకుండా, సిచ్యుయేషనల్ కామెడీతో ఆకట్టుకున్న విధానం బాగుంది. కథకి చాలా ముఖ్యమైన విషయాలు అనుపమ్ ఖేర్ పాత్ర ద్వారా రివీల్ చేయడం మరో ప్లస్ గా నిలిచిందనే చెప్పాలి.

సాంకేతికవర్గం పనితీరు: కార్తీక్ ఘట్టమనేని సినిమాటోగ్రఫీ & సి.జి వర్క్ సినిమాకి బిగ్గెస్ట్ ఎస్సెట్. చాలా నార్మల్ లొకేషన్స్ ను కూడా తనదైన కెమెరా పనితనంతో సన్నివేశానికి తగ్గట్లు ఎలివేట్ చేసిన విధానం బాగుంది. అలాగే.. కథకు తగ్గట్లు గ్రాఫిక్స్ కోసం పెట్టిన ఖర్చు, సదరు గ్రాఫిక్స్ ను కథనం కోసం వినియోగించుకున్న తీరు బాగున్నాయి. ఆడియన్స్ కు ఒక డిఫరెంట్ ఎక్స్ పీరియన్స్ ఇవ్వడంలో ఈ రెండూ కీలకపాత్ర పోషించాయి. కాలభైరవ నేపధ్య సంగీతం కంటే నేపధ్య సంగీతం ఎక్కువగా ఆకట్టుకుంది.

ప్రొడక్షన్ డిజైన్ & ఆర్ట్ వర్క్ సినిమాకి ప్రత్యేక ఆకర్షణలు. దర్శకుడు, కథకుడు చందు మొండేటి.. సినిమాను మొదలుపెట్టిన తీరు ప్రశంసనీయం. చాలా ఆసక్తికరంగా మొదలెట్టాడు కథని. అయితే.. కథలోనికి జొప్పించిన కొన్ని సబ్ ఫ్లాట్స్ కు లాజిక్స్ & సింక్ మిస్ అవ్వడం చిన్నపాటి మైనస్. పలు హాలీవుడ్ సినిమాల స్పూర్తి ఎక్కువగా కనిపించింది. ఓవరాల్ గా ఆడియన్స్ కు సినిమాపై ఆసక్తి పెంచడంలో మాత్రం సక్సెస్ అయ్యాడు. సో, డైరెక్టర్ గా చందు మొండేటి కార్తికేయ 2తో తన పూర్వ వైభావాన్ని దక్కించుకున్నట్లే.

విశ్లేషణ: రొటీన్ సినిమాలకు భిన్నంగా, ఆసక్తికరంగా సాగే సినిమా “కార్తికేయ 2”. చిన్నపాటి లాజికల్ ఆన్సర్స్ ను విస్మరిస్తే.. ఓవరాల్ గా ఆడియన్స్ కు ఒక డీసెంట్ సినిమాటిక్ ఎక్స్ పీరియన్స్ ఇవ్వడంలో “కార్తికేయ 2” సక్సెస్ అయ్యింది. అలాగే.. పార్ట్ 3 కోసం ఇచ్చిన లీడ్ కూడా బాగుంది. “సీతారామం, బింబిసార”ల తర్వాత “కార్తికేయ 2” తెలుగు సినిమా బాక్సాఫీస్ జెండాను రెపరెపలాడించింది.

రేటింగ్: 2.5/5 

Click Here To Read in ENGLISH

Read Today's Latest Reviews Update. Get Filmy News LIVE Updates on FilmyFocus