Soubin Shahir: ఐటెమ్‌ సాంగ్‌లో ఓ యాక్టర్‌కి క్రేజ్‌.. ఈ పరిస్థితి ఎప్పుడైనా చూశారా?

ఐటమ్‌ సాంగ్స్‌కి ఓ ప్రత్యేకత ఉంటుంది. స్టార్‌ హీరోయిన్‌ వచ్చి సూపర్‌ స్టెప్పులు వేయడంతో ప్రేక్షకులకు ఆ సినిమాలో ఆ పాట మోస్ట్‌ లైక్డ్ అయిపోతుంది. అందులో హీరో కూడా ఉన్నా.. హీరోయిన్‌ మీదనే ఆ పాటంతా నడుస్తుంది. దాంతో ఆ పాట పేరెత్తగానే ఆ హీరోయినే గుర్తొస్తుంది. అయితే ‘కూలీ’ సినిమా నుండి వచ్చిన ‘మోనికా..’ అనే పాటకు సంబంధించినంత వరకు హీరోయిన్‌తోపాటు ఆ పాటలో డ్యాన్స్‌ వేసిన ప్రముఖ నటుడు కూడా వైరల్‌ అవుతున్నాడు. సోషల్ మీడియాలో కొన్నిసార్లు అతనే ఎక్కువగా హైలైట్‌ అవుతున్నాడు.

Soubin Shahir

సినిమాల్లో ఐటెమ్‌ సాంగ్స్‌ అంటే అందులోనూ పూజా హెగ్డే డ్యాన్స్‌ వేసిన ఐటెమ్‌ సాంగ్స్‌ అంటే కచ్చితంగా విజయం సాధిస్తాయి అని చెప్పొచ్చు. ‘రంగస్థలం’ సినిమాలో ‘జిగేలు రాణి..’ కానీ, ‘ఎఫ్‌ 3’ సినిమాలో ‘అధ్యక్షా..’ పాటలనే దీనికి ఉదాహరణ. ఇప్పుడు ‘మోనికా..’ అంటూ వచ్చి హ్యాట్రిక్‌ కొట్టింది పూజా హెగ్డే. ఈ పాటలో ఆమెతోపాటు మరో నటుడు హైలైట్‌ అవుతున్నాడు. అతడే ప్రముఖ మలయాళ యాక్టర్‌ సౌబిన్‌ సాహిర్‌. ఆమె పక్కనే డ్యాన్స్‌ వేశాడని కాదు కానీ.. ఆయన స్టెప్పులు, ఈజ్ అలా ఉన్నాయి మరి.

తమిళ సినిమాల్లో, తమిళం నుండి డబ్బింగ్ అయి మన దగ్గరకు వచ్చిన సినిమాల్లో ఐటెమ్‌ సాంగ్స్‌ అంటే రీసెంట్‌ టైమ్‌లో మనకు ఎక్కువగా వినిపించిన పాట ‘నువ్వు కావాలయ్యా..’. ‘జైలర్‌’ సినిమాలో రజనీకాంత్‌, తమన్నా మధ్య తెరకెక్కిన ఐటెమ్‌ సాంగ్‌ అది. మధ్యలో సునీల్‌ అక్కడక్కడ కనిపిస్తాడు. ఇప్పుడు ఆ పాటను మించిన విజయం అందుకునే దిశలో వెళ్తోంది ‘కూలీ’ సినిమాలోని ‘మోనికా..’ సాంగ్‌. అందులో పూజా హెగ్డే కీలకం కాగా.. సౌబిన్‌ వైరల్‌ ఎలిమెంట్. వైవిధ్యమైన నటనతో ఇన్నాళ్లూ అలరించిన సౌబిన్‌ ఈ సినిమాలో డ్యాన్స్‌లో అదరగొట్టాడు.

సినిమాలో సౌబిన్‌ ఉన్నారు అనగానే సమ్‌థింగ్‌ స్పెషల్‌ కన్‌ఫామ్‌ అనుకున్నారంతా. దానికి నాగార్జున, ఉపేంద్ర, ఆమిర్‌ ఖాన్‌ లాంటి యాడ్‌ ఆన్స్‌ కూడా ఉన్నాయి. ఇక రజనీకాంత్‌ ఎలానూ ఉన్నారు. సినిమా ఆఖరులో కమల్‌ హాసన్‌ రావొచ్చు అని అంటున్నారు. ఇందులో క్లారిటీ లేదు. ఎందుకంటే ఈ సినిమా లోకేశ్‌ సినిమాటిక్‌ యూనివర్స్‌ కిందకు వస్తుందో లేదో ఇంకా చెప్పలేదు దర్శకుడు. అంటే లేదు అని అన్నాడు కానీ.. ఆయన మాటలు ఈ విషయంలో నమ్మలేం.

సైలెంట్ గా రామ్ సినిమాని కంప్లీట్ చేసేస్తున్నారా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus