Kasturi Shankar: నేను పబ్ కు అందుకే వెళ్ళేది. .. సీక్రెట్ రివీల్ చేసిన కస్తూరి శంకర్

తెలుగు సినీ ఇండస్ట్రీలో నటిగా గుర్తింపు సంపాదించుకున్నటువంటి వారిలో నటి కస్తూరి శంకర్ ఒకరు. నాగార్జున హీరోగా నటించిన అన్నమయ్య సినిమాలో నటించారు అనంతరం పలు సినిమాలలో నటించి ఇండస్ట్రీకి దూరంగా ఉన్నటువంటి కస్తూరి శంకర్ ప్రస్తుతం తన సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించారు ఇలా వరుస బుల్లితెర కార్యక్రమాలలోనూ అలాగే వెబ్ సిరీస్ లలో నటిస్తూ సెకండ్ ఇన్నింగ్స్ ఎంతో బిజీగా ఉన్నారు. ఇలా సెకండ్ ఇన్నింగ్స్ లో ఎంతో బిజీగా గడుపుతున్న ఉన్నటువంటి కస్తూరి శంకర్ సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటూ తరచూ తనకు సంబంధించిన విషయాలు మాత్రమే కాకుండా ఇతర సెలెబ్రిటీల విషయాల గురించి కూడా స్పందిస్తూ ఈమె తన అభిప్రాయాలను తెలియజేస్తూ ఉంటారు

అయితే కొన్ని సందర్భాలలో ఈమె వివాదాలలో కూడా చిక్కుకుంటూ వార్తల్లో నిలుస్తుంటారు. ఇలా ఎన్నో వివాదాల ద్వారా వార్తల్లో నిలిచినటువంటి కస్తూరి శంకర్ తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొనే పలు విషయాలను వెల్లడించారు ఈ సందర్భంగా ఈమె మాట్లాడుతూ తాను తన స్నేహితులతో కలిసి పబ్ కి వెళ్తానని తెలిపారు అక్కడ వారందరూ తాగి బాగా ఎంజాయ్ చేస్తూ ఉండగా నేను కూడా ఒక వాటర్ మిలన్ జ్యూస్ తాగి వారితో కలిసి డాన్స్ చేస్తాను.

అయితే ఒకసారి అక్కడికి వెళ్లిన తర్వాత అక్కడ వాష్ రూమ్ శానిటైజ్ చేసే వాళ్ళు నన్ను గుర్తుపట్టి మీరు తెలుసుగారి కదా అంటూ నన్ను అడగడం చాలా సంతోషంగా అనిపించిందని ఈమె తెలిపారు.. ఇక నేను పబ్ కు వెళ్తానని అయితే అందరిలాగా తాగి డ్యాన్సులు చేస్తూ ఎంజాయ్ చేయనని తెలిపారు నా స్నేహితులంతా ఫుల్లుగా తాగి చేస్తూ ఉండగా వారందరిని సేఫ్ గా నేను ఇంట్లో దించడం కోసం వారికి డ్రైవర్ గా మాత్రమే వెళ్తాను అంటూ ఈ సందర్భంగా కస్తూరి శంకర్ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

ఇక భారతీయుడు సినిమాలో ఎలాగైనా హీరోయిన్గా ఛాన్స్ అందుకోవాలని ఉద్దేశంతో ఈమె డైరెక్టర్ శంకర్ కి ఏకంగా బికినీ ఫోటోలు కూడా పంపించాను అయితే ఆయన నన్ను హీరోయిన్గా కాకుండా కమల్ హాసన్ గారికి సిస్టర్ గా ఎంపిక చేశారు అంటూ ఈ సందర్భంగా (Kasturi Shankar) ఈమె కామెంట్స్ చేశారు.

మా ఊరి పొలిమేర 2 సినిమా రివ్యూ & రేటింగ్!

కీడా కోలా సినిమా రివ్యూ & రేటింగ్!
నరకాసుర సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus