Brahmamudi August 16th: స్వప్న చేష్టలకు స్వప్న పై కోప్పడిన రాహుల్!

కుటుంబ కథా నేపథ్యంలో కొనసాగుతూ ఎంతో మంచి ఆదరణ సంపాదించుకున్నటువంటి బుల్లితెర సీరియల్ బ్రహ్మముడి సీరియల్ రోజు రోజుకు ఎంతో మంచి ఆదరణ పొందుతుంది. ఇక నేటి ఎపిసోడ్ లో భాగంగా ఈ సీరియల్ లో ఏం జరిగిందనే విషయానికి వస్తే… కావ్యను పుట్టింటికి పంపించకూడదని రాజ్ నూనె పోస్తారు అది గమనించిన కావ్య మీ పప్పులు నా దగ్గర ఉడకలేదు అంటూ తాను తనకు తెలియకుండా వీడియో రికార్డ్ చేసిన విషయాన్ని రాజ్ కి చూపిస్తుంది. దీంతో రాజ్ షాక్ అవుతాడు.నేను జారీ కిందపడి నా నడుం విరిగితే ఎవరు బాధ్యులని కావ్య అడగడంతో నేను అంత దూరం ఆలోచించలేదు తల్లి నువ్వు కింద పడితే పుట్టింటికి వెళ్లకుండా ఆగిపోతావని ఇలా చేశానని రాజ్ చెబుతాడు.

ఇప్పుడు ఈ వీడియోని నేను తాతయ్య గారికి వెళ్లి చూపించాలని అనుకుంటున్నానని కావ్య తనని బ్లాక్మెయిల్ చేస్తూ ఉంటుంది దీంతో రాజ్ అంత పని మాత్రం చేయకు నీకు ఎంత డబ్బు కావాలో అంత ఇస్తాను అని చెప్పడంతో కావ్య నన్ను డబ్బుతో ఎవరు కొనలేరు కానీ నాకు అవసరమైనది అవసరమైనప్పుడు అడుగుతాను అంటూ కావ్య బెదిరిస్తుంది.దాంతో రాజ్ అనవసరంగా దీన్ని దగ్గర ఇరుక్కున్నాను ఇప్పుడు నన్నే బ్లాక్మెయిల్ చేస్తుంది అంటూ కంగారు పడతారు. ఇక కిందికి వచ్చినటువంటి కావ్య సీతారామయ్య దగ్గర ఆశీర్వాదం తీసుకొని పుట్టింటికి బయలుదేరుతుంది.

చిట్టి మాట్లాడుతూ కంటే కూతుర్నే కనాలి అని ఎవరన్నారో తెలియదు కానీ ఆ మాటను నువ్వు నిజం చేశావు.మొదట్లో నిన్ను అపార్థం చేసుకున్నాము గాని నువ్వే గెలిచావు నువ్వు ఇల్లు గెలవడమే కాదు రచ్చ కూడా గెలిచావు అంటూ చిట్టి కావ్యను పొగుడుతూ ఉంటుంది. అంతలోపు కావ్య ఫోన్లో ఏదో చూస్తుండగా ఏం చేస్తున్నావని సీతారామయ్య అడగడంతో క్యాబ్ బుక్ చేస్తున్నాను తాతగారు అని చెప్పగా క్యాబ్ ఎందుకు రాజ్ ఉన్నాడుగా తానే డ్రాప్ చేస్తాడని చెప్పడంతో అపర్ణ కోపంతో రగిలిపోతుంది. ఆ ఇంటికి ఇంటికి రాకపోకలు ఉండకూడదని నేను చెబుతుంటే ఇప్పుడు స్వయంగా నా కొడుకుని తీసుకెళ్లి అక్కడ డ్రాప్ చేయమని చెబుతారనీ అపర్ణ కోప్పడగా కావ్య మాత్రం లేదులెండి అత్తయ్య గారు నేనే ఆటోలో వెళ్తానని చెబుతుంది.

దాంతో సుభాష్ తన భార్యను మందలించి రాజ్ నువ్వు కావ్యాను తీసుకెళ్లి వాళ్ళ ఇంటిదగ్గర డ్రాప్ చేయమని చెప్పగా ఇక మీ తండ్రి ఆర్డర్ వేశారు కదా వెళ్ళు నాయనా అంటూ అక్కడి నుంచి కోపంతో వెళ్ళిపోతుంది. మరోవైపు అప్పు కళ్యాణ్ ఆ చీటీలో ఉన్న అడ్రస్ కి వెళ్తారు అక్కడికి వెళ్తాడు .సైకియాట్రిస్ట్ హాస్పిటల్. కళ్యాణ్ వాళ్ళు లోపలికి వెళ్ళగానే మీరు కళ్యాణ్ కదా మీకోసమే వెయిట్ చేస్తున్నాను అంటూ అతనికి ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తాడు డాక్టర్. నాకెందుకు ట్రీట్మెంట్ చేస్తున్నారు అంటూ కళ్యాణ్ చెబుతాడు. మీకు ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తే ఇలాగే మాట్లాడుతారని ఆ అమ్మాయి చెప్పిందని డాక్టర్ చెబుతారు.

నాకేమీ పిచ్చి లేదంటూ కళ్యాణ్ కి వెళ్ళిపోతుండగా ఒక చీటీ ఇస్తారు డాక్టర్ అందులోనా ఫోన్ నెంబర్ తో మీకెందుకు ఫోన్ చేస్తానని అనుకున్నావు నా ఫోన్ నెంబర్ కనుక్కో అని రాసి ఉంటుంది.మరోవైపు స్వప్న ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకోగా నెగిటివ్ వస్తుంది. దీంతో కంగారుగా తన ఫ్రెండ్ కి ఫోన్ చేయగా నువ్వు కమిట్ అయి రెండు రోజులవుతుంది ఎప్పుడు పడితే అప్పుడు ప్రెగ్నెన్సీ రావడానికి అదేమైనా వస్తువా అంటూ తనని తిడుతుంది.అంతలోపే రాహుల్ అక్కడికి రాగా ఇందాక ఏదో అన్నావ్ నేను సరిగా వినిపించుకోలేదు ఏంటి అని స్వప్నను అడగడంతో ఆ రాజ్ చూడు తన భార్యని ఎంత బాగా చూసుకుంటున్నాడు అంటూ స్వప్న మాట్లాడటంతో రాహుల్ తనపై కోప్పడతాడు.

ఏదో నువ్వు ప్రెగ్నెంట్ అని నేను నిన్ను పెళ్లి చేసుకున్నాను లేకపోతే నిన్ను పెళ్లి చేసుకునే వాడిని కాదు అంటూ తనని తిట్టి వెళ్లిపోతాడు.మరోవైపు కార్లో వెళుతూ ఉండగా రాజ్ అంతరాత్మ వచ్చి ఇలాంటి మంచి అందమైన భార్య పక్కన ఉంటే తనతో ఎందుకు గొడవ పడతావు అంటూ తనని తాకడానికి వెళ్తాడు దాంతో తన ఆత్మను కొట్టబోగా ఆ దెబ్బ కావ్య చంపకు పడుతుంది దీంతో కావ్య నన్నెందుకు కొట్టారు నేను తాతయ్య గారితో చెబుతా అంటూ బ్లాక్మెయిల్ చేస్తూనే ఉంటుంది.

జైలర్ సినిమా రివ్యూ & రేటింగ్!

భోళా శంకర్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘భోళా శంకర్’ తో పాటు సిస్టర్ సెంటిమెంట్ తో రూపొందిన సినిమాల లిస్ట్..!

Read Today's Latest Television Update. Get Filmy News LIVE Updates on FilmyFocus