తెలంగాణ నిర్మాణ సారధి బయోపిక్ రెడీ అవుతోంది

ప్రస్తుతం తెలుగులో బయోపిక్ ల జోరు కొనసాగుతోంది. సావిత్రి బయోపిక్ గా వచ్చిన ‘మహానటి’ ఘన విజయాన్ని సాధించడంతో, బయోపిక్ ల రూపకల్పన మరింత ఊపందుకుంది. ఒక వైపున ఎన్టీఆర్ బయోపిక్ రూపొందుతూ వుంటే, మరోవైపున కాంతారావు బయోపిక్ కి సంబంధించిన పరిశోధన జరుగుతోంది. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ బయోపిక్ కూడా రూపొందనున్నట్టు కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి.

తాజాగా ఈ సినిమాను హైదరాబాద్ లోని అన్నపూర్ణ స్టూడియోలో లాంచ్ చేశారు. ఈ కార్యక్రమానికి సినిమా యూనిట్ తో పాటు పలువురు ప్రముఖులు హాజరయ్యారు. కల్వకుంట్ల నాగేశ్వరరావు నిర్మిస్తోన్న ఈ సినిమాకి అల్లూరి కృష్ణంరాజు దర్శకుడిగా వ్యవహరించనున్నారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కేసీఆర్ సాగించిన పోరాటం నేపథ్యంలో ఈ సినిమా కొనసాగుతుంది కనుక, ఈ సినిమాకి ‘ఉద్యమ సింహం’ అనే టైటిల్ ను ఖరారు చేశారు. ఈ సినిమాలో కేసీఆర్ పాత్రను నాజర్ పోషించనున్నారు. త్వరలోనే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలుకానుంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus