KD Teaser: నటి రక్షిత భర్త దర్శకత్వంలో చిరంజీవి తమ్ముడు!

  • October 21, 2022 / 01:42 PM IST

కొన్నాళ్ల క్రితం వరకు కన్నడ ఇండస్ట్రీ అంటే ఎవరికీ పెద్దగా తెలిసేది కాదు.. వాళ్ల మార్కెట్ తక్కువ.. ఇతర భాషల్లో హిట్ అయిన సినమాలు రీమేక్ చేయడం ఎక్కువ అనుకునేవారు. కట్ చేస్తే.. రాజమౌళి, ప్రభాస్ ఎలా అయితే తెలుగు సినిమా స్టామినాని ప్రపంచానికి చూపించారో అదే స్థాయిలో పాన్ ఇండియా, పాన్ వరల్డ్ రేంజ్ లో ‘కె.జి.యఫ్’ తో యావత్ ప్రపంచం చూపు కన్నడ ఇండస్ట్రీ వైపు తిప్పేలా చేశారు డైరెక్టర్ ప్రశాంత్ నీల్, రాకింగ్ స్టార్ యశ్.. లేటెస్ట్ సెన్సేషన్ ‘కాంతార’ తో రిషబ్ శెట్టి తమ పరిశ్రమ గురించి మరోసారి ప్రపంచమంతా మాట్లాడుకునేలా చేశాడు.

అదే కోవలో మరోసారి బాక్సాఫీస్ పై దండయాత్ర చెయ్యడానికి రాబోతున్నాడు ‘యాక్షన్ ప్రిన్స్’ ధృవ్ సర్జా.. ‘యాక్షన్ కింగ్’ అర్జున్ కి చిరంజీవి సర్జా అనే మేనల్లుడున్న సంగతి తెలిసిందే. కోవిడ్ టైంలో ఆయన మరణించారు. చిరు తమ్ముడే ఈ ధృవ్ సర్జా.. కన్నడలో హీరోగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు. ‘పొగరు’ మూవీతో టాలీవుడ్ జనాలకి పరిచయమయ్యాడు. విలన్ కటౌట్ తో హీరోగా ఎలా చేశాడబ్బా అంటూ అందరూ ఆశ్చర్యపోయారు. ‘కరాబు’ సాంగ్ అయితే బాగా పాపులర్ అయ్యింది.

ఇప్పుడు ‘KD – ది డెవిల్’ అనే సాలిడ్ యాక్షన్ ఎంటర్ టైనర్ తో ఆడియన్స్ ముందుకు రాబోతున్నాడు. రీసెంట్ గా టైటిల్ టీజర్ రిలీజ్ చేశారు. ‘ఇడియట్’, ‘ఆంధ్రావాలా’, ‘నిజం’ వంటి పలు తెలుగు సినిమాల్లో హీరోయిన్ గా నటించిన రక్షిత భర్త ప్రేమ్ ఈ మూవీని డైరెక్ట్ చేస్తున్నాడు. కెవిఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్ మీద కెవిఎన్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. పాపులర్ కన్నడ మ్యూజిక్ డైరెక్టర్ అర్జున్ జన్యా సంగీత మందిస్తున్నారు. టీజర్ లో ధృవ్ ‘కాళీ’ అనే పవర్ ఫుల్ మాస్ క్యారెక్టర్ లో కనిపించనున్నట్టు చూపించారు.

అతను జైలు నుండి రిలీజ్ అవుతుంటే.. బయట అతణ్ణి చంపడానికి వేల మంది జనాభా వచ్చారని పోలీసులు కంగారు పడడం.. చంపడానికి కాదు, ఊరేగించడానికి ఒక జన సముద్రమే వచ్చిందని తెలిసి ఆశ్చర్యపోవడం వంటివి చూపించి గూస్ బంప్స్ తెప్పించారు. ‘‘ఫీల్డ్ లోకి దిగాక.. యుద్ధం చెయ్యాల్సిందే.. చస్తే, వీరమరణం.. గెలిస్తే.. సింహాసనం.. యుద్ధం మొదలెడదామా అన్నయ్యా’’ అంటూ ధృవ్ చెప్పిన డైలాగ్ అదిరిపోయింది. కంప్లీట్ ఊరమాస్ అవతార్ లో సరికొత్తగా కనిపిస్తున్నాడు. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ మూవీని త్వరలో ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.

కాంతార సినిమా రివ్యూ & రేటింగ్!


ఎన్టీఆర్ – సావిత్రి టు చిరు- నయన్.. భార్యాభర్తలుగా చేసి కూడా బ్రదర్- సిస్టర్ గా చేసిన జంటలు..!
తన 44 ఏళ్ల కెరీర్లో చిరంజీవి రీమేక్ చేసిన సినిమాలు మరియు వాటి ఫలితాలు..!
సౌందర్య టు సమంత.. గర్భవతి పాత్రల్లో అలరించిన హీరోయిన్ల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus