Keeravani: ‘నాటు నాటు’ గురించి కీరవాణి నాటు ఆన్సర్‌.. ఏమన్నారంటే?

ఎన్నో ఏళ్లుగా టాలీవుడ్‌కి కలగా మిగిలిపోయిన అంశం ఆస్కార్‌. ఆ మాటకొస్తే కేవలం టాలీవుడ్‌కి కాదు, మొత్తంగా మన దేశానికే కలగా మిగిలిపోయింది. అన్నేళ్ల కలను తీర్చిన చిత్రం ‘ఆర్‌ఆర్‌ఆర్‌’. ఆ సినిమాలో ‘నాటు నాటు..’ పాటకు గాను ఇటీవల ఆస్కార్‌ అవార్డు వచ్చింది. అయితే ఆ పాట తన టాప్‌ 100 లిస్ట్‌లో లేదు అని అంటున్నారు ఆ చిత్ర సంగీత దర్శకుడు ఎం.ఎం.కీరవాణి. రామ్‌ గోపాల్‌ వర్మకు ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో కీరవాణి ఈ మేరకు కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇంకా ఆయనేం చెప్పారంటే…

కాంట్రవర్సీకి మరో పేరుగా నిలిచిన రామ్‌ గోపాల్‌ వర్మ.. ఇటీవల ‘నిజం’ అంటూ ఓ యూట్యూబ్‌ ఛానల్‌ స్టార్ట్‌ చేశారు. అంతేకాదు అదే పేరుతో వరుసగా ఇంటర్వ్యూలు చేస్తూ వస్తున్నారు. వివిధ అంశాలపై ఆయన ఇంటర్వ్యూలు చేయగా.. అందులో కీరవాణితో జరిగిన ఇంటర్వ్యూను విడుదల చేశారు. అందులో ‘నాటు నాటు…’ పాట గురించి ఇద్దరూ మాట్లాడుకున్నారు. ఇప్పుడు వారి మధ్య జరిగిన చర్చ సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

‘ఆస్కార్ వెనుక నాటు నిజం’ అనే పేరుతో లేటెస్ట్ ఎపిసోడ్‌లో ‘నాటు నాటు..’ పాటకు ఆస్కార్ దక్కడం గురించి ప్రశ్నించారు రామ్ గోపాల్ వర్మ. ‘నాటు నాటు..’ పాట ఇంకెవరైనా మ్యూజిక్ డైరెక్టర్ చేసి ఉంటే దానికి ఆస్కార్ వచ్చి ఉంటే ఆ పాటకి అంత అర్హత ఉందని మీరు భావించేవారా? అంటూ క్రిటికల్‌ ప్రశ్నను అడిగారు వర్మ. దీనికి కీరవాణి ‘‘ఈ పాటకు ఆస్కార్ రావడానికి చాలా కారణాలు ఉన్నాయి. అవన్నీ తర్వాత చెప్తాను. పాటగా దీనికి ఆస్కార్ వచ్చిందందుకు నేను ఫీల్ అవ్వను’’ అని చెప్పారు.

ఎందుకంటే.. ‘‘జయహో…’ పాటకు ఆస్కార్ వచ్చినప్పుడు కూడా అలా ఫీల్ అవ్వలేదు అని తేల్చేశారు (Keeravani) కీరవాణి. ‘జయహో..’ పాట ఎంత మెరిట్ తీసుకుందో దీనికి కూడా అంతే మెరిట్ దక్కుతుంది అని చెప్పారు. మరి ‘నాటు నాటు..’ పాట మీ కెరీర్‌లో టాప్ 100 సాంగ్స్ ఈ పాట ఉంటుందా అని అడిగితే.. లేదు అని షాకింగ్‌ సమాధానం ఇచ్చారు. ‘నాటు నాటు..’ పాట తన టాప్ లిస్టులో లేకపోయినా, తనకు నచ్చిన పాటే అని చెప్పారు.

ఏజెంట్ సినిమా రివ్యూ & రేటింగ్!
పొన్నియన్ సెల్వన్సినిమా రివ్యూ & రేటింగ్!

బట్టలు లేకుండా నటించిన వారిలో ఆ హీరోయిన్ కూడా ఉందా?
పెళ్లికి ముందు గర్భవతి అయిన హీరోయిన్స్.. ఈ లిస్ట్ లో ఆ హీరోయిన్ కూడా ఉందా

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus