టాలీవుడ్ లో ఎంఎం కీరవాణి, మణిశర్మ ఇద్దరు దిగ్గజ సంగీత దర్శకులు. వీళ్లు కలిసి ఓ పాటకు పనిచేస్తే ఆ పాట ఎంతో ప్రత్యేకం. మణిశర్మ సంగీత దర్శకత్వం చేసిన ఎన్టీఆర్ సినిమా ‘సుబ్బు’లో కీరవాణి పాట పాడారు. ఆ పాట తర్వాత 20 ఏళ్లకు “బలమెవ్వడు” చిత్రంలో మణిశర్మ స్వరకల్పనలో కీరవాణి పాట పాడారు. బలమెవ్వడు కరి బ్రోవను అని సాగే పాటను కీరవాణి అద్భుతంగా ఆలపించారు. “బలమెవ్వడు” సినిమాలో క్లైమాక్స్ ఫైట్ లో బ్యాక్ గ్రౌండ్ సాంగ్ లా ఈ పాట వస్తుంది. అల వైకుంఠపురములో ఫేమ్ లిరిసిస్ట్ కళ్యాణ్ చక్రవర్తి ఈ పాటను రాశారు. ‘బలమెవ్వడు కరి బ్రోవను..’ పాటకు కీరవాణి మాత్రమే న్యాయం చేయగలరని మణిశర్మ భావించి ఈ పాటను ఆయనతో పాడించారు.
బలమెవ్వడు కరిబ్రోవను, బలమెవ్వడు పాండు సుతుల భార్యన్ గావన్, బలమెవ్వడు సుగ్రీవునకు, బలమెవ్వడు నాకు నీవె బలమౌ కృష్ణా…మకరి నోట చిక్కిన కరి మొరను ఆలింపగా, పరుగున పడి వచ్చితివట పైట చెంగు వీడక, పాపపు పొలిమేర వరకు పరధ్యానమైనా, పండిన వేళకు పొడిచే చిన్న గాలివానా, నిందాస్తుతి చేయు వరకు నిదానించనేలా, ఎంత గొంతు ఎత్తాలి నువ్వు తరలిరాగా…అంటూ ఉద్విగ్నంగా సాగుతుందీ పాట. “బలమెవ్వడు” చిత్రానికి కీరవాణి పాడిన ఈ పాట ప్రత్యేక ఆకర్షణ కానుంది.
ధృవన్ కటకం, నియా త్రిపాఠీ జంటగా నటిస్తున్న “బలమెవ్వడు” సినిమా వైద్యరంగంలోని దోపిడీని ప్రశ్నించబోతోంది. ఈ చిత్రానికి సత్య రాచకొండ దర్శకత్వం వహిస్తున్నారు. సనాతన దృశ్యాలు సమర్పణలో ఆర్ బి మార్కండేయులు “బలమెవ్వడు” చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇటీవల విడుదల చేసిన “బలమెవ్వడు” కాన్సెప్ట్ టీజర్ కు మంచి రెస్పాన్స్ వస్తోంది. నిజ జీవిత ఘటనల ఆధారంగా ఈ సినిమా రూపొందుతోంది.
నటీనటులు : ధృవన్ కటకం, నియా త్రిపాఠీ, ఫృథ్విరాజ్, సుహసిని, నాజర్, వివేక్ త్రివేది, అప్పారావు, ఐ డ్రీమ్ అంజలి, మణి మహేష్, శ్రావణ్ భరత్
సాంకేతిక నిపుణులు : సంగీతం – మణిశర్మ, సాహిత్యం – కళ్యాణ్ చక్రవర్తి, సినిమాటోగ్రఫీ – సంతోష్ శక్తి, గిరి.పి, ఎడిటర్- జెస్విన్ ప్రభు, ఫైట్స్ – శివరాజ్, కాస్ట్యూమ్స్ – హరీష రాచకొండ, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ – ధృవన్ కటకం, నిర్మాత – ఆర్ బి మార్కండేయులు, రచన దర్శకత్వం – సత్య రాచకొండ
ఇష్క్ మూవీ రివ్యూ & రేటింగ్!
తిమ్మరుసు మూవీ రివ్యూ & రేటింగ్!
‘నారప్ప’ మూవీ నుండీ అదిరిపోయే డైలాగులు..!