పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న మూవీ టైటిల్ ఇంకా అధికారికంగా ప్రకటించలేదు కానీ.. ఈ రోజు మాటల మాంత్రికుడు పుట్టినరోజు సందర్భంగా “బయటకొచ్చి చూస్తే” అనే పాటను రిలీజ్ చేశారు. అందమైన సాహిత్యంతో అనిరుధ్ చేసిన మ్యాజిక్ కి యువత అంతా ఆహా అంటున్నారు. ఈ పాట యూట్యూబ్లో రికార్డు సృష్టిస్తోంది. ఈ సంగతి పక్కన పెడితే త్రివిక్రమ్ టీమ్ మొత్తం ప్రస్తుతం బల్గేరియాలో ఉంది. నిన్నటి వరకు అను ఎమ్మాన్యుయేల్, పవన్ కల్యాణ్ మధ్య కొన్ని రొమాంటిక్ సన్నివేశాలతో పాటు ఓ సాంగ్ కూడా చిత్రీకరించారు. పవన్ తో త్రివిక్రమ్ చేసిన గత చిత్రాల్లో ఇద్దరు భామలతో పవన్ రొమాన్స్ ఉండాల్సిందే. ఆ సెంటిమెంట్ ప్రకారం ఇందులోనూ మరో హీరోయిన్ కీర్తి సురేష్ తోను కొన్ని క్యూట్ సీన్స్ తెరకెక్కించనున్నారు.
అందుకే ఆమె యూరప్ పయనమైంది. మహానటి సినిమాకు సంబంధించి ఢిల్లీలో భారీ షెడ్యూల్ పూర్తిచేసిన కీర్తి సురేష్.. రెస్ట్ తీసుకోకుండా యూరప్ బయల్దేరింది. మధ్యలో మాస్కోలో దిగి షాపింగ్ కూడా చేసింది. ఆ ఫోటోని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఇలా ఈ విషయం బయటికి వచ్చింది. రేపటి నుంచి సోఫియా సిటీలో పవన్, కీర్తి లపై కొన్ని సన్నివేశాలు షూట్ చేయనున్నారు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్లో రాధాకృష్ణ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని జనవరి 10న రిలీజ్ చేయనున్నారు.