కీర్తి సురేష్ ఆ విషయంలో చాలా ముందుందిగా..!

సినీ ఇండస్ట్రీలో హీరోయిన్ల టైం ఎప్పటి నుండీ ఎప్పటి వరకూ కొనసాగుతుందో.. కచ్చితంగా చెప్పలేం. స్టార్ ఇమేజ్ సొంతం చేసుకున్నప్పటికీ ఎక్కువ కాలం నిలబడతారు అనే గ్యారంటీ ఉండదు. ముఖ్యంగా అది హిట్ పర్సెంటేజ్ పై ఆధారపడి ఉంటుంది. ఓ రేంజ్లో దూసుకువచ్చిన వారికి కూడా హిట్లు లేకపోతే వారి క్రేజ్ పడిపోతుంటుంది. ఆ టైములో వారు మిగిలిన భాషల్లోకి చెక్కేస్తూ ఉంటారు. ఇదిలా ఉంటే.. ఇప్పుడైతే పూజా హెగ్దే, రష్మిక మందన స్టార్ హీరోయిన్లుగా రాణిస్తున్నారు.

స్టార్ హీరోల ఫస్ట్ ఛాయిస్ వీళ్ళిద్దరే కావడం విశేషం. అయితే సాయి పల్లవి, కీర్తి సురేష్ లకు కూడా భారీ డిమాండ్ ఉంది. కానీ వారు మాత్రం నాయికా ప్రాధాన్యత ఎక్కువగా ఉన్న సినిమాలే ఎంచుకుంటున్నారు. గ్లామర్ పాత్రలకు, లిప్ లాక్ లకు చాలా వరకూ దూరంగా ఉంటూ వస్తున్నారు. ఇప్పుడు కీర్తి సురేష్ ఏకంగా పూజా హెగ్దే మరియు రష్మిక లను ఓ విషయంలో బీట్ చేసిందట. అదెలా అనుకుంటున్నారా? ఇప్పుడు పూజా హెగ్దే తెలుగులో ప్రభాస్ మరియు అఖిల్ చిత్రాల్లో నటిస్తుంది. వీటితో పాటు రెండు బాలీవుడ్ సినిమాల్లో కూడా నటిస్తుంది.

ఇక రష్మిక విషయానికి వస్తే… తెలుగులో బన్నీ నటిస్తున్న ‘పుష్ప’ చిత్రంతో పాటు తమిళంలో ఓ సినిమా.. అలాగే కన్నడంలో ఓ సినిమా చేస్తుంది. అయితే కీర్తి సురేష్ విషయానికి వస్తే ‘పెంగ్విన్’, ‘రంగ్ దే’, ‘మిస్ ఇండియా’, ‘గుడ్ లక్ సఖీ’, ‘అన్నాతై’ వంటి చిత్రాలతో పాటు నితిన్ హీరోగా నటిస్తున్న ‘పవర్ పేట’ చిత్రానికి కూడా ఓకే చెప్పినట్టు తెలుస్తుంది. దాంతో పూజా హెగ్దే 4, రష్మిక 3 సినిమాలతో బిజీగా ఉండగా.. కీర్తి సురేష్ ఏకంగా 6 సినిమాలతో బిజీగా ఉన్నట్టు తెలుస్తుంది. ఇలా కీర్తి సురేష్… పూజ, రష్మిక లను బీట్ చేసినట్టు స్పష్టమవుతుంది.

Most Recommended Video

ఎన్టీఆర్ రిజెక్ట్ చేసిన 12 సినిమాలు!
తెలుగు హీరోలను చేసుకున్న తెలుగురాని హీరోయిన్స్
అందమైన హీరోయిన్స్ ని పెళ్లి చేసుకున్న టాలీవుడ్ విలన్స్

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus