మహానటి కోసం 120 కాస్ట్యూమ్స్ ధరించిన కీర్తి సురేష్!

అభినేత్రి సావిత్రి బయోపిక్ మూవీ “మహానటి” వేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. దర్శకుడు నాగ్ అశ్విన్  దర్శకత్వంలో  స్వప్న దత్ ‘స్వప్న సినిమా’ పతాకంపై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సావిత్రి పాత్రలో కీర్తి సురేష్ నటిస్తుండగా, క్యూట్ బ్యూటీ సమంత జమునగా కనిపించనుంది. మాలీవుడ్ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్, సావిత్రి భర్త జెమినీ గణేశన్ పాత్రలో కనిపించనున్నారు. మార్చి 29 న రిలీజ్ కానున్న ఈ సినిమా గురించి కీర్తి సురేష్ ఆసక్తికర విషయాన్ని బయటపెట్టింది. ఓ ఇంటర్వ్యూ లో ఆమె మాట్లాడుతూ…  “ఇంతవరకు ఏ సినిమాలో కనిపించని విధంగా “మహానటి” లో కనిపిస్తాను.

నిడివి కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. సాధారణంగా ఏ చిత్రంలోనైనా ఒక హీరోయిన్ సరాసరి 30 కాస్ట్యూమ్స్ వేసుకుంటారు.  మహానటిలో మాత్రం నేను 120 రకాల కాస్ట్యూమ్స్ వాడాను” అని వివరించారు.  సావిత్రి లైఫ్ లోని ముఖ్యమైన ఘట్టాలను ఈ చిత్రంలో చూపించనున్నారు. అందుకే అలనాటి విలక్షణ నటుడు ఎస్ వీ రంగారావు పాత్రలో మోహన్ బాబు నటిస్తున్నారు. అలాగే అలనాటి దర్శకుల్లో ఒకరిగా క్రిష్ కనిపించబోతున్నారు. ఇంకా విజయ్ దేవరకొండ, షాలిని పాండేలు కూడా కొంతసేపు మెరవనున్నారు. ఎంతోమంది స్టార్స్ నటిస్తున్న ఈ చిత్రంపై భారీ అంచనాలున్నాయి.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus