Keerthy Suresh: షర్ట్ బటన్స్ తీసేసి కీర్తి సురేష్ స్టెప్పులు

మహానటి సినిమాతో ఆల్ టైమ్ బెస్ట్ హీరోయిన్స్ లలో చోటు సంపాదించుకున్న కీర్తి సురేష్ లో మాస్ యాంగిల్ కూడా గట్టిగానే ఉన్నట్లు మరోసారి నిరూపించింది. నేడు తలపతి విజయ్ 47వ పుట్టినరోజు సందర్భంగా ఒక్కొక్కరు ఒక్కో విదంగా విషెస్ అందిస్తున్నారు. ఇక కీర్తి సురేష్ తనలోని అభిమానిని తట్టి లేపింది. సాధారణంగా ఒక మాస్ అభిమాని ఎలాగైతే స్టెప్పులు వేస్తాడో అలాగే వేసి తన ప్రేమను చాటుకుంది. విజయ్ కెరీర్ లో సూపర్ హిట్ గా నిలిచింది ఆల్ తోట భూపతి పాటకు ఊర మాస్ స్టెప్పులు వేసింది.

అలాగే షర్ట్ బటన్స్ తీసేసి నడుమందలు హైలెట్ అయ్యేలా అభిమానులకు మంచి కిక్కిచ్చింది. ‘కేవలం నువ్వు పెర్ఫార్మన్స్ లోనే బీస్ట్ కాదు..ఎంటర్టైన్ చేయడంలో కూడా బీస్ట్’ అంటూ తలపతికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసింది. తోడుగా ఒక డ్యాన్సర్ తమ్ముడు కూడా ఇరగదీసాడు అని కీర్తి సురేష్ అతన్ని ట్యాగ్ చేసింది. విజయ్ తో కీర్తి సురేష్ ఇదివరకే ఒక సినిమా చేసింది. మురగదాస్ దర్శకత్వంలో వచ్చిన సర్కార్ సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించిన విషయం తెలిసిందే.

ఆ సినిమాకు విజయ్, కీర్తిని సజెస్ట్ చేయడం వల్లే మురగదాస్ ఫిక్స్ చేశాడు. ఎందుకంటే విజయ్ కు సావిత్రి అంటే అభిమానం. అప్పట్లో మహానటి సినిమా ఫస్ట్ లుక్ చూడగానే విజయ్ కీర్తి సురేష్ కు ఫిదా అయ్యాడు. దాంతో ఆమెతో సినిమా చేయాలని సర్కార్ సినిమాకు ఓకే చేయించాడు.


బాలకృష్ణ మిస్ చేసుకున్న సినిమాల లిస్ట్.. హిట్లే ఎక్కువ..!
సింహా టైటిల్ సెంటిమెంట్ బాలయ్యకి ఎన్ని సార్లు కలిసొచ్చిందో తెలుసా?
26 ఏళ్ళ ‘పెదరాయుడు’ గురించి ఈ 10 సంగతులు మీకు తెలుసా?

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus