ఎన్టీఆర్ ఫ్యాన్స్ ను టెన్షన్ పెట్టే న్యూసే ఇది..!

‘ఆర్.ఆర్.ఆర్’ తరువాత ఎన్టీఆర్ .. త్రివిక్రమ్ డైరెక్షన్లో ఓ చిత్రం చెయ్యబోతున్న సంగతి తెలిసిందే.అయితే కరోనా కారణంగా ‘ఆర్.ఆర్.ఆర్’ చిత్రం షూటింగ్ లేట్ అవుతూ ఉండడంతో.. ఈ గ్యాప్ లో హీరో రామ్ తో ఓ చిత్రం చెయ్యాలని త్రివిక్రమ్ భావిస్తున్నాడు.అందుకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా జరుగుతున్నాయి. 5 లేదా 6 నెలల్లో రామ్ – త్రివిక్రమ్ ల సినిమా పూర్తయిపోతుందట. అప్పటికి ‘ఆర్.ఆర్.ఆర్’ చిత్రానికి సంబంధించి ఎన్టీఆర్ పార్ట్ కూడా పూర్తయిపోతుందని వినికిడి.

కాబట్టి వెంటనే త్రివిక్రమ్ మూవీ షూటింగ్లో ఎన్టీఆర్ జాయిన్ అయ్యే అవకాశాలు ఉన్నాయని కూడా సమాచారం. ఇదిలా ఉండగా ‘అరవింద సమేత’ చిత్రంలో ఎన్టీఆర్ సరసన పూజా హెగ్డేను హీరోయిన్ గా ఎంపిక చేసుకున్నాడు త్రివిక్రమ్.అయితే ఈసారి మాత్రం కీర్తి సురేష్ ను ఎంపిక చేసుకోవాలని భావిస్తున్నాడట. ఈ విషయం పై ఇంకా క్లారిటీ రాలేదు కానీ.. ఈ వార్త బయటకి వచ్చినప్పటి నుండీ ఎన్టీఆర్ ఫ్యాన్స్ లో మాత్రం కంగారు మొదలయ్యింది.

ఎందుకంటే ఈ మధ్యన కీర్తి సురేష్ నటించిన సినిమాలు వరుసగా ఫ్లాప్ అవుతుండడమే అని తెలుస్తుంది. అంతేకాదు పవన్ కళ్యాణ్ తో త్రివిక్రమ్ తెరకెక్కించిన ‘అజ్ఞాతవాసి’ చిత్రంలో కూడా కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించిన సంగతి తెలిసిందే.ఆ చిత్రం కూడా పెద్ద డిజాస్టర్ అయ్యింది. ఈ ఫ్లాప్ సెంటిమెంట్లను తలుచుకునే ఎన్టీఆర్ ఫ్యాన్స్ టెన్షన్ పడుతున్నట్టు స్పష్టమవుతుంది.

Most Recommended Video

ఈ 15 సినిమాలకి మొదటి ఛాయిస్ ఈ హీరోయిన్లు కాదు.. మరెవరో తెలుసా..!
50 కి దగ్గరవుతున్నా.. పెళ్లి గురించి పట్టించుకోని హీరొయిన్ల లిస్ట్..!
‘కలర్ ఫోటో’ నుండీ హృదయాన్ని హత్తుకునే 15 డైలాగులు ఇవే..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus