కీర్తి మాత్రమే కాదు.. ఆమె తల్లి కూడా స్టార్ హీరోయినే..!

ప్రస్తుతం టాలీవుడ్లోనే కాకుండా కోలీవుడ్లో కూడా స్టార్ హీరోయిన్ గా దూసుకుపోతుంది కీర్తి సురేష్. ‘మహానటి’ చిత్రంతో ఈమె అమాంతంగా స్టార్ హీరోయిన్ అయిపోయింది. ఆ చిత్రంతో ఏకంగా నేషనల్ అవార్డునే కైవసం చేసుకుంది కీర్తి సురేష్. ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి, సూపర్ స్టార్ రజినీ కాంత్, మహేష్ బాబు వంటి స్టార్ హీరోల సినిమాల్లో నటిస్తూ యమ బిజీగా గడుపుతుంది కీర్తి సురేష్. ఈ లాక్ డౌన్ టైములో ఈమె నటించిన రెండు సినిమాలు ఓటిటి వేదికగా విడుదలయ్యాయి కానీ..

అవి అంతగా ఆకట్టుకోలేకపోయాయి.ఇదిలా ఉండగా.. నేషనల్ అవార్డు దక్కించుకోవాలి అనే కోరిక తన తల్లికి బలంగా ఉండేదని కీర్తి సురేష్ పలు సందర్భాల్లో చెప్పుకొచ్చిన సంగతి తెలిసిందే. నిజానికి కీర్తి సురేష్ తల్లి కూడా పెద్ద స్టార్ హీరోయినే..! సినీ పరిశ్రమ ఒకటిగా ఉండే రోజుల్లో… తెలుగు, తమిళ భాషల్లో ఎన్నో విజయవంతమైన సినిమాల్లో నటించింది కీర్తి సురేష్ తల్లి మేనక. తెలుగు, తమిళ్ తో పాటు మలయాళం కన్నడ భాషల్లో కలుపుకుని ఏకంగా 116 సినిమాల వరకూ నటించింది.

మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన ‘పున్నమి నాగు’ చిత్రంలో కూడా మేనక హీరోయిన్ గా నటించింది. ఈమె కెరీర్ మంచి పీక్స్ లో ఉన్న టైములో నిర్మాత జి.సురేష్‌ కుమార్ ను వివాహం చేసుకుని సినిమాలకు గుడ్‌బై చెప్పేసింది మేనక. ఈమెకు ఇద్దరు కూతుళ్లు.ఒకరు రేవతి సురేష్ కాగా మరొకరు కీర్తి సురేష్‌ కావడం విశేషం.

Most Recommended Video

బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీస్ ను రిజెక్ట్ చేసిన రాజశేఖర్..!
టాలీవుడ్లో సొంత జెట్ విమానాలు కలిగిన హీరోలు వీళ్ళే..!
ఈ 25 మంది హీరోయిన్లు తెలుగు వాళ్ళే .. వీరి సొంత ఊర్లేంటో తెలుసా?

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus